Ragneeti: బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ వద్ద మాటలు, మనసులు కలిశాయ్!
ప్రేమకు పునాది స్నేహం అంటుంటారు. అలా స్నేహితులుగా పరిచయమై.. ప్రేమతో దగ్గరై.. తాజాగా పెళ్లితో ఒక్కటయ్యారు సెలబ్రిటీ కపుల్ పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా. కాలేజీ రోజుల్లో ప్రారంభమైన తమ ప్రేమను ఇటీవలే నిశ్చార్థంతో ఓ మెట్టెక్కించిన ఈ జంట వివాహం ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.