Shikha Malhotra: కరోనా, పక్షవాతం.. రెంటినీ జయించి.. ఇప్పుడు నటిగా రీఎంట్రీ!
జీవితంలో కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముడితే జీవితమే వ్యర్థమనిపిస్తుంది.. కానీ ఇలాంటి సమయంలో ధైర్యాన్ని కూడగట్టుకొని, సానుకూల దృక్పథంతో అడుగు ముందుకేస్తే.. శిఖా మల్హోత్రాలా తిరిగి నిలబడగలుగుతాం. వృత్తిరీత్యా నటి అయినా కొవిడ్ సమయంలో నర్సుగా నిస్వార్థమైన సేవలందించిన ఆమె.. కరోనా సోకి ఒక దశలో చావు అంచుల దాకా వెళ్లింది.