‘ప్లే డేట్‌’లకు వెళ్లండి..!

ఈ కాంక్రీట్‌ జంగిల్‌ నగరాల్లో... గజిబిజి జీవనశైలిలో ఒడుదొడుకులన్నీ తట్టుకుని నిలబడాలంటే... తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిందే. సమయంతో పరుగులు పెట్టాల్సిందే.

Eenadu icon
By Vasundhara Team Published : 31 Oct 2025 01:29 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కాంక్రీట్‌ జంగిల్‌ నగరాల్లో... గజిబిజి జీవనశైలిలో ఒడుదొడుకులన్నీ తట్టుకుని నిలబడాలంటే... తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిందే. సమయంతో పరుగులు పెట్టాల్సిందే. దానిలో భాగంగానే ప్రాజెక్టులూ, లక్ష్యాలూ, డెడ్‌లైన్లూ అంటూ సెలవు రోజుల్లోనూ ఇంటి నుంచే సేవలు అందించేవారు పెరుగుతున్నారు. మరి మీ అవసరం సంస్థలకేనా... మీ పిల్లల సంగతేంటి? వాళ్ల పెంపకం, కోరికల గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు వాళ్లతో కలసి ఆడాలనీ, మాట్లాడాలనీ, సమయం గడపాలనీ ఎంతగా కోరుకుంటారో తెలుసా? వాళ్లకి సమయం కేటాయించలేకపోతున్నాం అని మీరు తెచ్చిపెట్టే బొమ్మలూ, గ్యాడ్జెట్లూ వాళ్ల ఆశల్ని తీర్చలేవు. మీ ప్రేమానురాగాల్ని వారికి దగ్గర చేయలేవు. అందుకే వారానికి ఒక్కసారైనా ‘ప్లే డేట్‌’లకు వెళ్లమంటున్నారు నిపుణులు. పనులన్నీ పక్కనపెట్టి వాళ్లతో ఆడి పాడమంటున్నారు. ఇది పిల్లలతో బంధాన్ని బలపరచడమే కాదు... మీ ఒత్తిడినీ దూరం చేస్తుంది. రోజంతా కుదరకపోతే ఉదయం, సాయంత్ర వేళల్లో అయినా దీన్ని ప్రయత్నించమంటున్నారు. ఇద్దరు, ముగ్గురు పేరెంట్స్‌ కలిసి ప్లాన్‌ చేసుకున్నా మంచిదే. ఓ చిన్న గెట్‌ టుగెదర్‌లానూ ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్