మీరు వింటేనే... వాళ్లూ వింటారు!

‘పెద్దవాళ్లు ఏం చెప్పినా పిల్లలు వినాల’ని చెబుతాం. కరెక్టే కానీ... మీరెప్పుడైనా మీ పిల్లల మాట విన్నారా? అసలు వాళ్లకేం తెలుసని? ఇదే మీ ప్రశ్నా? అయితే, మీ తీరు మార్చుకోవాల్సిందే అంటున్నారు మానసిక నిపుణులు.

Eenadu icon
By Vasundhara Team Published : 30 Oct 2025 02:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

‘పెద్దవాళ్లు ఏం చెప్పినా పిల్లలు వినాల’ని చెబుతాం. కరెక్టే కానీ... మీరెప్పుడైనా మీ పిల్లల మాట విన్నారా? అసలు వాళ్లకేం తెలుసని? ఇదే మీ ప్రశ్నా? అయితే, మీ తీరు మార్చుకోవాల్సిందే అంటున్నారు మానసిక నిపుణులు. ఎందుకంటే, వాళ్ల మాట మీరు విని అర్థం చేసుకుంటేనే సరైన దారిలో పెట్టగలిగేది అని చెబుతున్నారు. ఇందుకు మీరేం చేయాలంటే... 

సమయం ఇవ్వండి...

తీరిక లేని జీవనశైలి, పని ఒత్తిడి వల్ల...  పిల్లలతో గడిపే సమయం చాలామందికి దొరకడం లేదు. అలాగని బాధపడుతూ కూర్చోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఉన్న టైమ్‌లోనే వీలు చూసుకోవాలి. పిల్లలు నిద్రపోయాక మీరింటికి వస్తుంటే... ఉదయాన్నే వారికోసం ఓ అరగంట ముందు లేవండి. వాళ్లు రెడీ అవుతున్నప్పుడో, తింటున్నప్పుడో దగ్గర కూర్చుని కబుర్లు చెప్పండి. అప్పుడు రోజు ఎలా గడుస్తుందో? సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునే ప్రయత్నం చేయండి.

మాట్లాడనిస్తేనే... 

పిల్లలు తప్పు చేశారని తెలిస్తే చాలు... అంతెత్తున లేస్తారు కొందరు తల్లిదండ్రులు. క్రమశిక్షణలో ఉంచడం మంచిదే అయితే, మితిమీరి భయపెట్టడం మాత్రం తప్పే. దీనివల్ల వారి భావాల్ని, సమస్యల్ని మీకు చెప్పరు. ప్రతి పనీ మీకు తెలియకుండానే పూర్తి చేయాలనుకుంటారు. ఆ పరిస్థితి రానివ్వొద్దు. చిన్నారులు ఏదైనా చెప్పడానికి జంకుతున్నా? దాచిపెట్టాలని చూస్తున్నారని తెలిసినా వెంటనే నిలదీయొద్దు. మొదట పట్టించు  కోనట్లే ప్రవర్తించండి. ఆపై తమంతట తాముగా వాళ్లు నిజం చెప్పే ధైర్యాన్ని ఇవ్వండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు తోడుంటారనే భరోసా కల్పించండి. అప్పుడే ఏ విషయాన్నైనా మీతో స్వేచ్ఛగా చెప్పగలరు. ఒకవేళ    పొరపాట్లే చేసినా మీరు సరిదిద్దగలరు. 

తప్పించుకోవద్దు...

ఎదిగే పిల్లలకు ఎన్నో సందేహాలు. వాటికి సమాధానం ఇవ్వలేక కసురుకోవడమో, తిట్టి పంపించేయడమో చేస్తున్నారా? మరి  వాటినెవరు తీరుస్తారు? మీరే చెప్పాలి. చెప్పే సమయం లేకపోతే వాయిదా వేయండి. ఒక వేళ మీకు తెలియకపోతే తెలుసుకుని చెప్పండి. వీలైతే ఆ సమాధానాన్ని ఇద్దరూ కలిసే శోధించండి. ఇవన్నీ పిల్లల్ని  మీకు దగ్గర చేసే పనులే కదా! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్