ఉక్రెయిన్‌ ముందుకు.. రష్యా వెనక్కి

త్వరలోనే బఖ్‌ముత్‌ను వశం చేసుకుంటామని గత కొన్ని రోజులుగా చెబుతూ వచ్చిన రష్యాకు ఆ నగరంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

Updated : 14 May 2023 06:24 IST

బఖ్‌ముత్‌లో మారుతున్న సమీకరణాలు
దూసుకుపోతున్న జెలెన్‌స్కీ సేనలు

రోమ్‌: త్వరలోనే బఖ్‌ముత్‌ను వశం చేసుకుంటామని గత కొన్ని రోజులుగా చెబుతూ వచ్చిన రష్యాకు ఆ నగరంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఉక్రెయిన్‌ దళాల ఎదురుదాడికి వెనక్కి మళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ‘‘కొన్ని ప్రాంతాల్లో మా దళాలు దూసుకుపోతున్నాయి. శత్రువుకు తీవ్ర ప్రాణ, ఆయుధ నష్టం కలిగిస్తున్నాం’’ అని ఉక్రెయిన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. తమ దళాలు వెనక్కి మళ్లుతున్న విషయాన్ని రష్యా అంగీకరించింది. అయితే బఖ్‌ముత్‌లో ఇతర ప్రాంతాల్లో దూసుకుపోతున్నట్లు తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం వాటికన్‌ సిటీలో పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలిశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతోనూ సమావేశం కానున్నారు. అనంతరం ఆయన జర్మనీకి వెళ్లనున్నారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు