తుర్కియే ఎన్నికల్లో ఎర్డోగాన్‌ విజయం

తుర్కియే ఎన్నికల్లో అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్‌ మరోసారి విజయం సాధించారు. మలి విడత కౌంటింగ్‌లో ఆయన 52 శాతం ఓట్లు సాధించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ అనడోలు న్యూస్‌ ఏజెన్సీ ఆదివారం రాత్రి ప్రకటించింది.

Published : 29 May 2023 05:37 IST

అంకారా: తుర్కియే ఎన్నికల్లో అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్‌ మరోసారి విజయం సాధించారు. మలి విడత కౌంటింగ్‌లో ఆయన 52 శాతం ఓట్లు సాధించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ అనడోలు న్యూస్‌ ఏజెన్సీ ఆదివారం రాత్రి ప్రకటించింది. ప్రత్యర్థి కెమల్‌కు 48 శాతం ఓట్లు వచ్చినట్లు పేర్కొంది. ఎర్డోగాన్‌కు 52 శాతం ఓట్లు వచ్చినట్లు ప్రతిపక్ష అనుకూల మీడియాలో కూడా పేర్కొంది. దీంతో ఆయన విజయం ఖాయమైంది. రెండు దశాబ్దాలుగా ఎర్డోగాన్‌ తుర్కియే పాలకుడిగా కొనసాగుతున్నారు. ప్రధానిగా, అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వస్తే మూడో దశాబ్దంలోకి ప్రవేశిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని