రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్‌

ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్‌ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్‌ జహ్రా బాలోచ్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Published : 27 Apr 2024 05:28 IST

భారతీయ నేతలకు పొరుగు దేశం వినతి

ఇస్లామాబాద్‌: ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్‌ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్‌ జహ్రా బాలోచ్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. భారత్‌లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రయోజనాలు పొందే ఉద్దేశంతో కొందరు నేతలు నిర్లక్ష్యంగా పాకిస్థాన్‌ ప్రస్తావన తెస్తున్నట్లు ఆమె తెలిపారు. ‘‘భారత నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం చూస్తున్నాం. ప్రత్యేకంగా జమ్మూకశ్మీర్‌పై అసమంజసమైన వాదనలు నొక్కి చెబుతున్నారు. అతి జాతీయవాదంతో చెప్పే ఇలాంటి ఉద్రేకపూరిత మాటలు ప్రాంతీయ శాంతికి ముప్పుగా పరిణమిస్తాయి’’ అని ముంతాజ్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు