ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్‌ టీకా

చర్మ క్యాన్సర్‌ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను బ్రిటన్‌లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు.

Published : 27 Apr 2024 05:29 IST

లండన్‌: చర్మ క్యాన్సర్‌ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను బ్రిటన్‌లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. ఒక్కో రోగి అవసరాలకు తగ్గట్లు ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్‌ను కొద్దివారాల్లోనే సిద్ధంచేయవచ్చని వివరించారు. మెలనోమా మళ్లీ ఉత్పన్నం కాకుండా గణనీయంగా అది తగ్గించగలుగుతోందని ప్రయోగాల్లో వెల్లడైందని తెలిపారు. దీనిపై తుదివిడత ప్రయోగాలు జరుగుతున్నాయి. క్యాన్సర్‌ కణాలను లక్ష్యంగా చేసుకొని, వాటిని నాశనం చేయాలని శరీర రోగనిరోధక వ్యవస్థకు ఈ టీకా సూచనలిస్తుంది. ఇది ఊపిరితిత్తులు, మూత్రాశయం, మూత్రపిండాల క్యాన్సర్లపైనా పనిచేస్తుందని పరిశోధకులు వివరించారు. దీన్ని మోడెర్నా, ఎంఎస్‌డీ సంస్థలు అభివృద్ధి చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని