మూడోసారి తుర్కియే ఎర్డొగాన్‌...

తుర్కియే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రెచెప్‌ తయ్యబ్‌ ఎర్డొగాన్‌ (69) మూడోసారి అధ్యక్షుడిగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

Updated : 04 Jun 2023 06:29 IST

అంకారా: తుర్కియే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రెచెప్‌ తయ్యబ్‌ ఎర్డొగాన్‌ (69) మూడోసారి అధ్యక్షుడిగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన దేశాధ్యక్షుడు కావడానికి ముందు మూడుసార్లు ప్రధాని పదవినీ నిర్వహించారు. ఇంతవరకు 20 ఏళ్లపాటు తుర్కియేని పాలించిన ఎర్డొగాన్‌ ప్రస్తుత పదవీకాలం పూర్తయ్యాక 25 ఏళ్లు పాలించినవారవుతారు. ఆయన ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాల ప్రముఖులు హాజరయ్యారు. నాటోలో అమెరికా తరవాత రెండో అతిపెద్ద సైన్యం ఉన్నది తుర్కియేకే. లక్షలాది సిరియా శరణార్థులకు ఆశ్రయమిచ్చే తుర్కియే.. ఉక్రెయిన్‌ నుంచి ఆహార ధాన్యాల సరఫరాకు మధ్యవర్తిత్వం వహించి ప్రపంచ ఆహార భద్రతకు తోడ్పడింది. నాటోలో కొత్తగా ఏ దేశం చేరాలన్నా నాటో సభ్యులంతా ఏకగ్రీవ సమ్మతి తెలపాలి. తుర్కియే ఉగ్రవాదులుగా పరిగణిస్తున్న కుర్దులకు, ఇతరులకు స్వీడన్‌ ఆశ్రయమిస్తోందని ఎర్డొగాన్‌ గుర్రుగా ఉన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు