‘ప్రేమలేఖ’తో విరాళాలు సేకరించిన ట్రంప్‌

అమెరికా అధికార పీఠాన్ని మరోసారి దక్కించుకోవాలని కలలు కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

Published : 16 Feb 2024 05:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధికార పీఠాన్ని మరోసారి దక్కించుకోవాలని కలలు కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం వినూత్న పద్ధతుల్లో విరాళాలు సేకరిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మెలానియాకు రాసిన లేఖను ట్రంప్‌ తన విరాళాలు సేకరించే వెబ్‌సైట్‌లో పోస్టు చేశారు. ‘ఇది నా భార్యకు రాసిన వాలెంటైన్స్‌ డే లేఖ. మీరూ నాపై మీ ప్రేమను కురిపించండి’ అంటూ విరాళాలు కోరారు. ‘డియర్‌ మెలానియా. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా. నాపై నేరాభియోగాలు వచ్చినా.. నన్ను అరెస్టు చేసినా.. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా.. నువ్వు నన్ను వదిలిపెట్టలేదు. కష్ట సమయంలో నాకు అండగా నిలిచావు. నీ మార్గదర్శకత్వం లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నువ్వే నా ప్రపంచం - ప్రేమతో నీ భర్త డొనాల్డ్‌ ట్రంప్‌’ అని అందులో రాసుకొచ్చారు. ‘నాకు నియంతలంటే ఇష్టం. వారికి నేనంటే ప్రేమే. ఈ ప్రపంచంలో ఉన్న నియంతలందరికీ ట్రంప్‌ తరఫు నుంచి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ మరో రిపబ్లికన్‌ అభ్యర్థి నిక్కీ హేలీ ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని