సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తే అణు దాడి చేస్తాం

తమ దేశ ఉనికిని, సార్వభౌమత్వాన్ని, స్వాతంత్య్రాన్ని దెబ్బతీసే ఎటువంటి చర్యలు చేపట్టినా అణు దాడికి వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించారు.

Published : 14 Mar 2024 03:35 IST

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరిక

మాస్కో: తమ దేశ ఉనికిని, సార్వభౌమత్వాన్ని, స్వాతంత్య్రాన్ని దెబ్బతీసే ఎటువంటి చర్యలు చేపట్టినా అణు దాడికి వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించారు. పాశ్చాత్య దేశాల అటువంటి చర్యలను అమెరికా అడ్డుకుంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. రష్యా అధికార వార్తా సంస్థకు పుతిన్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. అది బుధవారం ఉదయం విడుదలైంది. ‘యుద్ధం తీవ్రమైతే ఎదురయ్యే పర్యవసానాలపై సీనియర్‌ రాజకీయ నేతగా బైడెన్‌కు అవగాహన ఉంది. ప్రపంచం అణు యుద్ధం దిశగా వెళ్తుందని నేను భావించడం లేదు. అదే సమయంలో మా అణు బలగాలు పూర్తి సిద్ధంగా ఉన్నాయి’ అని పుతిన్‌ పేర్కొన్నారు.  ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా సుముఖంగా ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే ఆ చర్చలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగాలని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌లో తమ లక్ష్యాలను సాధించి తీరతామని, ఈ యుద్ధంలో అతిగా జోక్యం చేసుకోవడం వంటి చర్యలు.. ప్రపంచ అణు సంఘర్షణ ముప్పుతో నిండి ఉన్నాయని పశ్చిమ దేశాలను ఆయన హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని