ఐఎన్‌ఏలో పోరాడిన ఈశ్వర్‌ లాల్‌సింగ్‌ మృతి

‘ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ’ (ఐఎన్‌ఏ)లో చేరి, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నేతృత్వంలో.. భారత్‌కు స్వాతంత్య్రం కోసం పోరాడిన విశ్రాంత మేజర్‌ ఈశ్వర్‌ లాల్‌సింగ్‌ (92) సింగపూర్‌లో

Published : 07 Aug 2022 05:42 IST

సింగపూర్‌, దిల్లీ: ‘ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ’ (ఐఎన్‌ఏ)లో చేరి, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నేతృత్వంలో.. భారత్‌కు స్వాతంత్య్రం కోసం పోరాడిన విశ్రాంత మేజర్‌ ఈశ్వర్‌ లాల్‌సింగ్‌ (92) సింగపూర్‌లో కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రకటించారు. లాల్‌సింగ్‌ మృతి పట్ల భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సంతాపం వ్యక్తంచేశారు. అసాధారణ ధైర్యసాహసాలతో భారత స్వాతంత్య్రం కోసం ఆయన పోరాడారని కొనియాడారు. 2019లో తాను సింగపూర్‌లో పర్యటించినప్పుడు ఆయనతో భేటీ అయ్యానని గుర్తు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని