Workouts: బరువులెత్తితే.. దీర్ఘాయుష్షు!

పరుగులు తీయడం, సైక్లింగ్‌ వంటి ఏరోబిక్‌ వ్యాయామాలు మన ఆయుష్షును పెంచుతాయని ఇప్పటికే వెల్లడైంది. అయితే బరువులు ఎత్తడం వల్ల కూడా ఎక్కువ కాలం జీవించొచ్చని చాలా మందికి తెలియదు. అమెరికాలోని నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజా అధ్యయనం ఈ విషయాన్ని ధ్రువపరిచింది.

Updated : 03 Oct 2022 08:29 IST

అమెరికా అధ్యయనంలో వెల్లడి

స్టిర్లింగ్‌: పరుగులు తీయడం, సైక్లింగ్‌ వంటి ఏరోబిక్‌ వ్యాయామాలు మన ఆయుష్షును పెంచుతాయని ఇప్పటికే వెల్లడైంది. అయితే బరువులు ఎత్తడం వల్ల కూడా ఎక్కువ కాలం జీవించొచ్చని చాలా మందికి తెలియదు. అమెరికాలోని నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజా అధ్యయనం ఈ విషయాన్ని ధ్రువపరిచింది. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు లక్ష మంది డేటాను పరిశీలించారు. వీరి సరాసరి వయసు 71 ఏళ్లు. అలాగే సరాసరి స్థూల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) 27.8 (ఊబకాయం)గా ఉంది. దాదాపు దశాబ్దం తర్వాత వీరిని మరోసారి పరిశీలించారు. గుండె జబ్బు లేదా మరేదైనా కారణాలతో వీరిలో మరణాలు సంభవించాయా అన్నది విశ్లేషించారు. అందులో వెల్లడైన అంశాలివీ..

* దాదాపు 23 శాతం మంది బరువులు ఎత్తారు. వీరిలో 16 శాతం మంది వారానికి 1-6 సార్లు ఈ కసరత్తును నిర్వహించారు. 32 శాతం మంది ఏరోబిక్‌ వ్యాయామాలను నిర్దేశించిన స్థాయిలో లేదా అంతకన్నా ఎక్కువగా చేశారు.

* బరువులు ఎత్తడం, ఏరోబిక్‌ వ్యాయామాల వల్ల క్యాన్సర్‌ మినహా ఇతర ఆరోగ్య కారణాలతో అకాల మరణం సంభవించే ముప్పు తగ్గుతుంది.

* బరువులు మాత్రమే ఎత్తినవారిలో 9-22 శాతం, ఏరోబిక్‌ వ్యాయామాలు మాత్రమే చేసేవారిలో 24-34 శాతం మేర అకాల మరణం ముప్పు తగ్గింది.

* ఏరోబిక్‌ వ్యాయామాలు, బరువులెత్తడం రెండూ చేసినవారికి మంచి ప్రయోజనం కలిగింది. ఉదాహరణకు వారానికి ఒకటి లేదా రెండు సార్లు బరువులెత్తడం, కనీసం నిర్దేశిత స్థాయిలో ఏరోబిక్‌ వ్యాయామాలు చేయడం వల్ల ఈ ముప్పు 4147 శాతం మేర తక్కువగా ఉంది.

* బరువులెత్తడం వల్ల పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా లబ్ధి పొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని