నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్‌కు ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారం
తమిళనాడులోని చిదంబరంలో పుట్టి లండన్‌లో స్థిరపడిన ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత వెంకీ రామకృష్ణన్ ఇంగ్లండ్‌లో ప్రతిష్ఠాత్మక ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారానికి ఎంపికయ్యారు.
లండన్: తమిళనాడులోని చిదంబరంలో పుట్టి లండన్‌లో స్థిరపడిన ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత వెంకీ రామకృష్ణన్ ఇంగ్లండ్‌లో ప్రతిష్ఠాత్మక ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది ఈ పురస్కారం పొందిన ఆరుగురిలో 70 ఏళ్ల వెంకీ రామకృష్ణన్ ఒకరు. సైన్యం, సైన్స్, కళలు, సాహిత్యం, సంస్కృతి తదితర అంశాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు బ్రిటన్ రాజకుటుంబం ఈ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణానికి ముందు సెప్టెంబరులో వెంకీ సహా ఆరుగురిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ప్రస్తుత రాజు చార్లెస్-3 ఈ పురస్కారాలను ప్రకటించినట్లు బకింగ్‌హమ్ ప్యాలెస్ శుక్రవారం వెల్లడించింది. అమెరికాలో బయాలజీ చదివిన రామకృష్ణన్.. తర్వాత బ్రిటన్ వెళ్లి స్థిరపడ్డారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ప్రముఖ పరిశోధన కేంద్రం ఎంఆర్‌సీ మాలిక్యులర్ బయాలజీ ల్యాబొరేటరీలో బృంద నాయకుడిగా సేవలందిస్తున్నారు. రైబొసోమల్ నిర్మాణంపై పరిశోధనలకు గానూ 2009లో ఆయనను నోబెల్ బహుమతి వరించింది. 2012లో బ్రిటన్ రాణి నుంచి ‘నైట్‌హుడ్’ పురస్కారం అందుకున్నారు. 2015 నుంచి 2020 వరకు ఆయన యూకే రాయల్ సొసైటీకి అధ్యక్షుడిగానూ సేవలందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
విశాఖలో పిడుగు పాటు
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
సముద్రంలో 36 గంటలు.. గణపతి విగ్రహ చెక్కబల్లే ఆధారంగా..
-
జాగ్రత్త.. ఎండార్స్ చేసినా కేసులు పెడుతున్నారు