చంపేందుకు మళ్లీ కుట్ర: ఇమ్రాన్‌

తనపై హత్యాయత్నం చేసి విఫలమైన ముగ్గురు నేరస్థులు.. మళ్లీ తనను తుదముట్టించేందుకు కుట్ర పన్నుతున్నారని పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు.

Updated : 27 Nov 2022 06:26 IST

రావల్పిండి: తనపై హత్యాయత్నం చేసి విఫలమైన ముగ్గురు నేరస్థులు.. మళ్లీ తనను తుదముట్టించేందుకు కుట్ర పన్నుతున్నారని పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు. శనివారం ఆయన రావల్పిండిలో తన పార్టీ.. తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ నెల మూడున తనపై జరిగిన హత్యాయత్నం తర్వాత ఇమ్రాన్‌ ర్యాలీలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, హోంమంత్రి సనాఉల్లా, ఐఎస్‌ఐ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధిపతి మేజర్‌ జనరల్‌ ఫైసల్‌ నసీర్‌లే తనపై దాడి వెనుక ఉన్నారని పేర్కొన్నారు. చావుకు భయపడవద్దని తన అనుచరులకు ఇమ్రాన్‌ పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు