కాంగోలో నరమేధం.. 50 మంది మృతి

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ  ‘ఎం23’ తిరుగుబాటుదారులు 50 మంది పౌరులను ఊచకోత కోసినట్లు కాంగో సైన్యం గురువారం పేర్కొంది.

Published : 03 Dec 2022 05:27 IST

ఎం23 తిరుగుబాటుదారుల చర్యగా సైన్యం ఆరోపణ

బెనీ(కాంగో): కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ  ‘ఎం23’ తిరుగుబాటుదారులు 50 మంది పౌరులను ఊచకోత కోసినట్లు కాంగో సైన్యం గురువారం పేర్కొంది. ఇలాంటి దాడుల నుంచి పౌరులను కాపాడుతామని స్పష్టం చేసింది. కాంగో తూర్పు ప్రాంతంలోని కిషిషే గ్రామంలో మంగళవారం ఈ హింస చోటుచేసుకున్నట్లు ఐక్యరాజ్య సమితి పీస్‌ కీపింగ్‌ మిషన్‌ తెలిపింది. బ్విటో సమీపంలోని ఓ పొలంలో అధికసంఖ్యలో మృతదేహాలను కనుగొన్నట్లు ఓ స్థానిక పౌరసంస్థ తెలిపింది. ఈ దాడి అనంతరం చాలామంది పౌరుల జాడ కూడా తెలియరాలేదని పేర్కొంది. ఈ ఘటనలో ‘ఎం23’తో పాటు రువాండా రక్షణ దళాల ప్రమేయం కూడా ఉన్నట్లు కాంగో సైన్యం ఆరోపించింది. తిరుగుబాటుదారులకు రువాండా మద్దతిస్తోందంటూ కాంగో చాలాకాలంగా ఆరోపిస్తుండగా.. రువాండా పదేపదే ఖండిస్తోంది. కాంగో సైన్యం ఆరోపణలను ఎం23 రాజకీయ ప్రతినిధి లారెన్స్‌ కన్యుకా తీవ్రంగా ఖండించారు. ఎం23 ఎన్నడూ పౌరుల జోలికి వెళ్లదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని