Plane Crash: విమాన ప్రమాదం.. ఇద్దరు కుమార్తెలు సహా హాలీవుడ్ నటుడి మృతి

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం సముద్రంలో కుప్పకూలడంతో(Plane Crash) హాలీవుడ్‌ నటుడు ప్రాణాలు కోల్పోయారు. 

Updated : 06 Jan 2024 11:43 IST

లాస్‌ఏంజెల్స్: విమాన ప్రమాదంలో హాలీవుడ్‌ నటుడు క్రిస్టియన్ ఒలివర్‌(Christian Oliver) దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణిస్తోన్న చిన్నపాటి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కరీబియన్ సముద్రంలో కూలిపోయింది. తీర రక్షక దళం ఘటనా స్థలం నుంచి వీరి ముగ్గురితోపాటు పైలట్‌ మృతదేహాన్ని వెలికితీసింది.

‘పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు మళ్లీ హింస.. రైలుకు నిప్పు’

జర్మనీలో జన్మించిన క్రిస్టియన్‌ ఒలివర్ వయస్సు 51 సంవత్సరాలు. ఇద్దరు కుమార్తెలు అన్నిక్‌(12) మదితా(10)తో కలిసి ఆయన ప్రైవేటు విమానంలో బెక్వియా నుంచి సెయింట్ లూసియాకు వెళ్తోన్న సమయంలో గురువారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఒలివర్‌.. హాలీవుడ్‌తో పాటు జర్మనీలో పలు టీవీ సిరీస్‌ల్లో నటించారు. కోబ్రా 11 సిరీస్‌తో మంచి పేరు సొంతం చేసుకున్నారు. ‘ది గుడ్ జర్మన్‌’, ‘స్పీడ్ రేసర్‌’ సహా మొత్తం 60 సినిమాల్లో ప్రేక్షకులను అలరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు