Hamas: ‘మెస్సీ మ్యాజిక్‌’.. హమాస్‌ నుంచి తప్పించుకున్న వృద్ధురాలు!

అర్జెంటీనాకు చెందిన ఓ వృద్ధురాలు ఫుట్‌బాల్‌ దిగ్గజ ఆటగాడు లియోనల్‌ మెస్సీ (Lionel Messi) పేరు చెప్పి హమాస్‌ నుంచి బయటపడిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.

Published : 08 Mar 2024 19:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు (Israel Hamas Conflict) జరిపిన మెరుపుదాడి భీకర యుద్ధానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇజ్రాయెల్‌ నుంచి అనేకమందిని ఎత్తుకెళ్లి బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు.. తీవ్ర సంప్రదింపుల నడుమ కొందరిని విడిచిపెట్టారు. ఈక్రమంలో అర్జెంటీనాకు చెందిన ఓ వృద్ధురాలు ఫుట్‌బాల్‌ దిగ్గజ ఆటగాడు లియోనల్‌ మెస్సీ (Lionel Messi) పేరు చెప్పి హమాస్‌ నుంచి బయటపడిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది.

ఇజ్రాయెల్‌లోని నిర్‌ ఓజ్‌ ప్రాంతంలో అర్జెంటీనాకు చెందిన ఎస్తర్‌ కునియో(90) నివాసముంటున్నారు. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన హమాస్‌ ముష్కరులు.. ఎస్తర్‌ ఇంట్లోకి చొరబడ్డారు. తుపాకీ ఎక్కుపెట్టి ఆమె కుటుంబీకుల గురించి ఆరా తీశారు. అయితే, వారి భాష ఆమెకు అర్థం కాలేదు. ఆ సమయంలో చోటుచేసుకున్న ఊహించని సంభాషణ వృద్ధురాలి ప్రాణాలను నిలిపింది.

పాఠశాలలపై బందిపోట్ల దాడి.. 280 మందికి పైగా చిన్నారుల కిడ్నాప్‌

‘మీరు ఫుట్‌బాల్‌ చూస్తారా? అని ఉగ్రవాదిని కునియో ప్రశ్నించగా.. ఆ ఆటంటే ఇష్టమని చెప్పాడు. ‘మెస్సీ మా దేశానికి చెందిన వ్యక్తే. నేను స్పానిష్‌ మాత్రమే మాట్లాడగలను’ అని వృద్ధురాలు చెప్పడంతో అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆశ్చర్యంగా చూస్తూ బదులిచ్చిన ఆ ఉగ్రవాది.. ‘నాకూ మెస్సీ అంటే ఎంతో ఇష్టం’ అని చెప్పాడట. ఆమె చేతికి రైఫిల్‌ అందించి ఓ విజయ సంకేతం చూపుతూ సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. ఇలా ఆ వృద్ధురాలు బయటపడినప్పటికీ ఆమె కుటుంబసభ్యులను మాత్రం బందీలుగా చేసుకున్నారు.

ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్ర దాడికి సంబంధించిన ఓ డాక్యుమెంటరీని ఓ స్పెయిన్‌ వార్తా సంస్థ చిత్రీకరించింది. ఆ రోజు చోటుచేసుకున్న భయానక పరిస్థితులను ఎస్తర్‌ కునియో అందులో వివరించారు. తన మాదిరిగానే కుటుంబసభ్యులను కూడా విడిపించేందుకు మెస్సీ సహాయం చేయాలని వేడుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు