Ukraine Crisis: రష్యా అణు యుద్ధ విన్యాసాలు..!

ఉక్రెయిన్‌పై యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ రష్యా అణు సన్నద్ధతను పెంచుకొంటోంది. తాజాగా 1,000 మంది సిబ్బందితో తాజాగా యుద్ధవిన్యాసాలు చేపట్టింది.

Published : 01 Jun 2022 11:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ రష్యా అణు సన్నద్ధతను పెంచుకొంటోంది. తాజాగా 1,000 మంది సిబ్బందితో యుద్ధవిన్యాసాలు చేపట్టింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మాస్కోలోని ఇవనోవ్‌ ప్రావిన్స్‌లో ఈ విన్యాసాలను చేపట్టింది. దీనిలో 100 వాహనాలతో పాటు యార్స్‌ ఖండాంతర బాలిస్టిక్‌ మిసైల్‌ లాంఛర్లను కూడా వినియోగించారు.

యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా పలుమార్లు అణ్వస్త్ర దళాలతో యద్ధవిన్యాసాలు చేసింది. గత నెల మొదట్లో కలినిన్‌గ్రాడ్‌ నగరంలో అణు సామర్థ్యం గల క్షిపణి దాడులను ప్రాక్టీస్‌ చేసినట్లు రష్యా ప్రకటించింది. బాల్టిక్‌ సముద్రంపై ఉన్న ఎంక్లేవ్‌లో ఇస్కాండెర్‌ మొబైల్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ వ్యవస్థకు చెందిన ఎలక్ట్రానిక్‌ ప్రయోగ వ్యవస్థతో మాక్‌ డ్రిల్‌ నిర్వహించింది. ఇందులో భాగంగా శత్రువుల వైమానిక స్థావరాలు, మౌలిక సదుపాయాలు, సైనిక పరికరాలు, కమాండ్‌ పోస్టులపై ఒకటి అంతకంటే ఎక్కువ సార్లు క్షిపణులు ప్రయోగించేలా సాధన చేసినట్లు తెలిపింది. ప్రతిదాడి నుంచి సైనిక సిబ్బంది తప్పించుకునే విన్యాసాలను కూడా అప్పట్లో చేపట్టింది. దాడుల అనంతరం వెలువడే రేడియేషన్‌, రసాయన పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపైనా సాధన చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని