Biden: ‘హమాస్‌.. అల్‌ఖైదా మాదిరిగానే’: జో బైడెన్‌

ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) మరోసారి స్పష్టం చేశారు. అదే సమయంలో హమాస్‌ దాడులతో పాలస్తీనీయులకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

Updated : 14 Oct 2023 15:04 IST

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌ - హమాస్‌ (Israel Hamas Conflict) మధ్య పోరు కొనసాగుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌.. అల్‌ఖైదా మాదిరిగానే కన్పిస్తోందని అన్నారు. ఇజ్రాయెల్‌కు తాము అండగా ఉంటామని మరోసారి భరోసా ఇచ్చారు.

‘‘హమాస్‌ దాడిలో 1000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 27 మంది అమెరికన్లు ఉన్నారు. వీళ్లు (హమాస్‌ గ్రూప్‌ను ఉద్దేశిస్తూ) చాలా దుర్మార్గులు. అల్‌ఖైదా ముష్కరుల్లాగే ప్రవర్తిస్తున్నారు. నేను ముందు నుంచీ చెబుతున్నట్లుగా ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు. హమాస్‌ దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది’’ అని బైడెన్‌ మరోసారి స్పష్టం చేశారు.

యుద్ధ నియమాలు పాటిస్తున్నారా?.. వాటిని అతిక్రమిస్తే నేరమే

హమాస్‌ దాడులతో పాలస్తీనా పౌరులకు ఎలాంటి సంబంధం లేదన్న వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలని బైడెన్‌ ఈ సందర్భంగా అన్నారు. ఈ యుద్ధం ఫలితంగా పాలస్తీనీయులు కూడా తీవ్ర కల్లోల పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇక హమాస్‌ దాడుల అనంతరం కొంతమంది అమెరికా పౌరులకు కన్పించకుండా పోయిన ఘటనపైనా బైడెన్‌ స్పందించారు. వారీ ఆచూకీ గుర్తించి, క్షేమంగా తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు