Chinook Chopper: భారత్‌కు అలర్ట్.. చినూక్ హెలికాప్టర్లను పక్కనపెట్టిన అమెరికా..!
సైనిక దళాల రవాణాలో కీలక పాత్ర పోషించే 400 చినూక్ హెలికాప్టర్లను అమెరికా సైన్యంలోని మెటీరియల్ కమాండ్ తాత్కాలికంగా పక్కనపెట్టింది.
ఇంటర్నెట్‌డెస్క్: సైనిక దళాల రవాణాలో కీలక పాత్ర పోషించే 400 చినూక్ హెలికాప్టర్లను అమెరికా సైన్యంలోని మెటీరియల్ కమాండ్ తాత్కాలికంగా పక్కనపెట్టింది. వీటి ఇంజిన్లలో మంటలు చెలరేగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఈ హెలికాప్టర్లను బోయింగ్ సంస్థ తయారు చేస్తోంది. 1960 నుంచి దళాల రవాణా, విపత్తు సహాయక చర్యలు, క్షతగాత్రుల తరలింపు వంటి కార్యక్రమాల్లో చినూక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రకం హెలికాప్టర్లను ఇటలీ, దక్షిణ కొరియా, కెనడా, భారత్ తదితర దేశాలు వినియోగిస్తున్నాయి. భారత వాయుసేనలో ప్రస్తుతం 15 చినూక్‌లు సేవలు అందిస్తున్నాయి.
‘‘హెచ్-47(చినూక్) హెలికాప్టర్ల ఇంధన ట్యాంకులు లీకై మంటలు చెలరేగడానికి గల కారణాలను సైన్యం గుర్తించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాం’’ అని అమెరికా సైన్యం అధికార ప్రతినిధి సింతియా.ఓ .స్మిత్ పేర్కొన్నారు. కాకపోతే ఈ ప్రమాదాల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ హెలికాప్టర్లను పక్కనపెట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తామని అమెరికా సైన్యం వెల్లడించింది. హనీవెల్ సంస్థ నిర్మించిన కొన్ని రకాల ఇంజిన్లు అమర్చిన హెలికాప్టర్లలో ఈ సమస్య ఉన్నట్ల చెబుతున్నారు. దీనిపై వ్యాఖ్యానించడానికి బోయింగ్ సంస్థ నిరాకరించింది. మరో వైపు హనీవెల్ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. అమెరికా సైన్యంతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ‘ఓ-రింగ్స్’గా పిలిచే భాగాలు సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా లేవని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
Nijjar murder: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో కెనడా అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
యుద్ధ విమానానికి పైలట్‌గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్‌గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్‌కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్‌భూషణ్ హడావుడి
-
రోహిత్‌కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?