Diwali at White House: దీపావళి వేడుకలకు శ్వేతసౌధం సన్నాహాలు

ఏటా నిర్వహించే దీపావళి వేడుకలకు అమెరికా శ్వేతసౌధం సిద్ధమవుతోంది. ఈసారి వేడుకల్లో జో బైడెన్‌ పాల్గొంటారని అధికార ప్రతినిధి తెలిపారు.

Published : 05 Oct 2022 09:43 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈసారి దీపావళి వేడుకల్ని శ్వేతసౌధంలో నిర్వహించే యోచనలో ఉన్నట్లు అధికార ప్రతినిధి జీన్‌ పియరీ తెలిపారు. గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా ఆయన ఉత్సవాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అయితే, ఎప్పుడు, ఎలా నిర్వహించబోతున్నారనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. భారత్‌తో పాటు అమెరికాలోని ప్రవాస భారతీయులతో ఉన్న అనుబంధం నేపథ్యంలో దీపావళి వేడుకల నిర్వహణకు బైడెన్‌ చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బుష్‌ అధ్యక్ష హోదాలో ఉన్నప్పటి నుంచి శ్వేతసౌధంలో దీపావళి వేడుకల్ని అధికారికంగా నిర్వహిస్తూ వస్తున్నారు. మరోవైపు మేరీల్యాండ్‌ గవర్నర్‌ లారెన్స్‌ హోగన్‌ అక్టోబరు నెలను ‘హిందూ సంప్రదాయ మాసం’గా ప్రకటించారు. ఈ నెలలోనే హిందువులు దసరా, దీపావళి, ధనత్రయోదశి వేడుకల్ని నిర్వహించుకోనున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని