USA: ఏమాత్రం బాధ్యత లేదు: పుతిన్‌ ‘అణు’ వ్యాఖ్యలపై అమెరికా ఫైర్‌

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin) ‘అణు’ హెచ్చరికలపై అమెరికా (USA) మండిపడింది. 

Updated : 01 Mar 2024 15:05 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌(Ukraine) యుద్ధంలో పశ్చిమ దేశాలు ఎక్కువగా జోక్యం చేసుకుంటే.. అది అణు సంక్షోభానికి దారితీస్తుందని రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్‌(Putin) చేసిన హెచ్చరికలను అమెరికా(USA) ఖండించింది.

‘పుతిన్‌ నుంచి ఇలాంటి బాధ్యత లేని మాటలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఒక అణ్వాయుధ దేశాధినేత ఇలా మాట్లాడటం సరికాదు. వాటిని వాడటం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి ఇప్పటికే పలుమార్లు రష్యాకు వెల్లడించాం. ఆ దేశం యుద్ధంలో వాటిని వాడటానికి సిద్ధమవుతోందన్న సూచనలు మాత్రం లేవు’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో అన్నారు.

గాజా ఘటనపై ప్రపంచ దేశాల ఆగ్రహం..!

వచ్చే నెల అధ్యక్ష ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో పుతిన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ‘‘పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు బలగాలను తరలించాలనుకోవడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. వారి భూభాగాల్లోని లక్ష్యాలనూ ఛేదించగల ఆయుధాలు మా వద్ద ఉన్నాయి. ఆ దేశాల నాయకులు ఇప్పటివరకు ఎటువంటి కఠినమైన సవాళ్లను ఎదుర్కోలేదు. యుద్ధం అంటే ఏంటో వారు మర్చిపోయారు’’ అని విరుచుకుపడ్డారు. ఈ సందర్భగా అణు హెచ్చరిక చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని