జిన్‌పింగ్‌-షెహబాజ్‌ సమావేశం: చైనీయుల భద్రతపై అధ్యక్షుడి ఆందోళన..!

రెండురోజుల పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనా వెళ్లారు. ఈ సందర్భంగా పాక్‌లో ఉన్న చైనీయుల భద్రతపై జిన్‌పింగ్ స్పందించారు. 

Published : 03 Nov 2022 14:23 IST

బీజింగ్‌: పాకిస్థాన్‌లో పనిచేసే తమ దేశ పౌరుల భద్రత గురించి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వారికి సురక్షిత వాతావారణం కల్పిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా(సిపెక్‌)కు చెందిన పలు ప్రాజెక్టుల్లో చైనా వాసులు పనిచేస్తున్నారు. 

రెండురోజుల పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనా వెళ్లారు. రెండు దేశాల మధ్య స్నేహాన్ని బలోపేతం చేసుకోవడంపై, 6,000 కోట్ల డాలర్ల సిపెక్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లడం గురించి చర్చించారు. ప్రధాని హోదాలో షెహబాజ్‌ బీజింగ్‌ వచ్చి జిన్‌పింగ్‌తో సమావేశమవడం ఇదే ప్రథమం. ‘పాకిస్థాన్‌లో ఉన్న చైనా ప్రజల భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నాను. చైనా సంస్థలు, ప్రజలకు మెరుగైన, సురక్షితమైన వాతావరణాన్ని పాక్‌ కల్పిస్తుందని భావిస్తున్నాం’ అని ఈ సమావేశంలో జిన్‌పింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. శ్రీలంకలా తాము ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా సాయం చేయాల్సిందిగా పాక్‌ ప్రధాని షెహబాజ్‌ ఈ పర్యటనలో చైనాకు విజ్ఞప్తి చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని