Nepal: యతి ఎయిర్‌లైన్స్..ఆయనది ఓ విషాద కథే!
ఆంగ్ తెష్‌రింగ్ షెర్పా నేపాల్‌లో విమానయానంతోపాటు, ఆతిథ్య రంగంలో వ్యాపారాలు నిర్వహిస్తుండేవారు. టెర్తుమ్ జిల్లాలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే విమానాశ్రయం ఏరియల్ సర్వే కోసం మంత్రి, మరో ముగ్గురు అధికారులతో కలిసి హెలికాఫ్టర్‌లో బయలుదేరి వెళ్లారు.
కాఠ్‌మాండూ: నేపాల్ (Nepal)లో జరిగిన విమాన ప్రమాదంలో 72 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన యతి ఎయిర్‌లైన్స్ (Yeti Airlines)యజమాని ఆంగ్ తెష్‌రింగ్ షెర్పా సైతం మూడు ఏళ్ల క్రితం జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈయన యతి ఎయిర్‌లైన్స్‌తోపాటు తారా ఎయిర్‌లైన్స్, నేపాల్‌కు చెందిన ఏకైక అంతర్జాతీ విమానయాన సంస్థ హిమాలయన్ ఎయిర్‌లైన్స్‌ను నిర్వహించేవారు. 2019 ఫిబ్రవరిలో నేపాల్‌లోని పతిభర జిల్లాలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆంగ్ తెష్‌రింగ్ షెర్పా మరణించారు. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు అప్పటి నేపాల్ విమానయానశాఖ మంత్రి రవీంద్ర అధికారి, మరో ముగ్గరు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.
ఆంగ్ తెష్‌రింగ్ షెర్పా నేపాల్‌లో విమానయానంతోపాటు, ఆతిథ్య రంగంలో వ్యాపారాలు నిర్వహిస్తుండేవారు. టెర్తుమ్ జిల్లాలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే విమానాశ్రయం ఏరియల్ సర్వే కోసం అప్పటి విమానయానశాఖ మంత్రి, మరో ముగ్గురు అధికారులతో కలిసి ఎయిర్ డైనెస్టి అనే హెలి సర్వీస్ సంస్థ హెలికాఫ్టర్‌లో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి వెళ్లారు. ఏరియల్ సర్వే అనంతరం తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో పతిభర జిల్లాలోని తాప్లెజంగ్ ప్రాంతంలోని కొండల్లో హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్‌లోని ఆరుగురు చనిపోయారు. అప్పట్లో ఈ వార్త నేపాల్‌లో సంచలనమైంది. తాజాగా ఆయన సంస్థకు చెందిన విమానం కూలిపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంస్థకు ఆయన తమ్ముడు లక్పా సోనమ్ షెర్పా ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MS Swaminathan: అధికార లాంఛనాలతో ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు: స్టాలిన్
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ
-
Adilabad: గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన WWE స్టార్