అమ్మ మాట!
పరీక్షలు పూర్తయ్యాయి.. వేసవి సెలవులు కూడా వచ్చేశాయి. నగరంలోని అపార్ట్మెంట్లలో పిల్లలంతా ఎవరి ఇళ్లలో వారు టీవీ చూడటమో, సెల్‌ఫోన్‌తో ఆడుకోవడమో చేస్తున్నారు. రవి వాళ్ల అమ్మ ఓ సంచిలో శెనక్కాయలను అతడి ముందు పోసి పొట్టు తీయమని చెప్పింది. ‘అసలేంటమ్మా.. ఇప్పుడే కదా టిఫిన్ చేసి అలా కూర్చున్నా..