రెండు నెలల్లో పోడు భూముల సమస్యకు పరిష్కారం

ప్రధానాంశాలు

రెండు నెలల్లో పోడు భూముల సమస్యకు పరిష్కారం

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: పోడు భూములకు ప్రభుత్వం రెండు నెలల్లో పట్టాలు మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించిన కేబినేట్‌ సబ్‌ కమిటీ ఈ నెల 23న తుది నిర్ణయం తీసుకోనుందని ఆయన తెలిపారు. ఆసిఫాబాద్‌ జిల్లా జోడేఘాట్‌లో బుధవారం నిర్వహించిన కుమురం భీం 81వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మినీ దర్బార్‌లో ఆయన మాట్లాడారు. గిరిజన బంధు సైతం అమలు చేయాలనే యోచనలో సీఎం ఉన్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. 2005 నుంచి పోడు సాగు చేస్తున్న రైతులకు పట్టాలివ్వాలని, జీవో నంబర్‌ 3పై సీఎం ఆర్డినెన్స్‌ తేవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కుమురం భీం మనవడి ఆందోళన
అంతకుముందు దర్బార్‌ నిర్వహించాలంటూ కుమురం భీం మనవడు సోనేరావు, గిరిజన సంఘాల నేతలు భీం స్మృతివనంలో ఆందోళన నిర్వహించారు. వర్ధంతి సందర్భంగా ఏటా నిర్వహించే ప్రజా దర్బార్‌ను ఈసారి కొవిడ్‌ నేపథ్యంలో నిర్వహించలేమని అధికారులు ప్రకటించడంతో వారు నిరసన తెలిపారు. మినీ దర్బార్‌ నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని