వదల రాజయ్యా.. నిన్నొదల..!

ప్రధానాంశాలు

వదల రాజయ్యా.. నిన్నొదల..!

కాళ్లకు చుట్టుకున్న సర్పం.. వదిలించుకునే క్రమంలో దాని తలను అదిమి పట్టుకున్న వ్యక్తి.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. ఈ కలకలానికి వేదికైంది కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి. శనివారం గడ్డమీద రాజయ్య అనే వ్యక్తి తన ఇంటి ఎదురుగా రోడ్డుమీద నిలబడి ఉండగా.. హఠాత్తుగా ఓ ఆరడుగుల జెర్రిగొడ్డు ఆయన కాళ్లను చుట్టేసింది. ఒంటిపైకి పాకే ప్రయత్నం చేయడంతో పామును వదిలించుకునేందుకు రాజయ్య నానా తిప్పలూ పడ్డాడు.  పాము తలను నొక్కిపట్టి లాగినా అది వదలకపోవడంతో ఆయన భయాందోళనలకు గురయ్యాడు. ఎట్టకేలకు ఓ యువకుడి సాయంతో అతికష్టం మీద సర్పాన్ని వదిలించుకున్నాడు. బతుకు జీవుడా.. అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. 

- న్యూస్‌టుడే, గన్నేరువరంTags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని