పేద బ్రాహ్మణులను ఆదుకోవాలి

ప్రధానాంశాలు

పేద బ్రాహ్మణులను ఆదుకోవాలి

రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు రాంమోహన్‌

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వాలు పేద బ్రాహ్మణులను ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కొత్త అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్‌ కోరారు. ఆదివారం హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని హనుమాన్‌ దేవస్థానం ఆవరణలో రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా ఓ.నాగకుమారి, ఉపాధ్యక్షుడిగా ఆర్‌.రాంచందర్‌, ప్రధాన కార్యదర్శిగా జి.విజయలక్ష్మి, కోశాధికారులుగా ఎ.పంచ గంగేశ్వర్‌, పి.సోమయాజులు, సలహాదారుగా ఎం.వి.శాస్త్రి ఎన్నికయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాంమోహన్‌ మాట్లాడారు. బ్రాహ్మణులు పూట గడవని స్థితిలో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ అర్చక, ఉద్యోగుల ఐకాస అధ్యక్షుడు పి.రవీంద్రాచార్యులు, వివిధ జిల్లాల బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని