పేదరికం వెనక్కి లాగితే... పట్టుదల ఒలింపిక్స్‌కు చేర్చింది!
close
Published : 03/08/2021 01:04 IST

పేదరికం వెనక్కి లాగితే... పట్టుదల ఒలింపిక్స్‌కు చేర్చింది!

స్కూల్లో ‘చేతిరాత’ పోటీలు జరుగుతున్నాయి... మొదటి బహుమతి గడియారం... దానికోసం పగలూ, రాత్రీ రాత సాధన చేసి ఫస్ట్‌ప్రైజ్‌ గెల్చుకుందో అమ్మాయి. ‘హమ్మయ్య.. ఇక హాకీ ట్రైనింగ్‌కు లేటవ్వదు. అందులో అలారం ఉంది’ అని సంబరపడిన ఆ పిల్లే ఇప్పుడు టోక్యోలో భారత మహిళల హాకీజట్టు సారథి రాణీరాంపాల్‌..

డపిల్లంటే కడుపులోనే చంపేద్దాం అనే భావన బలంగా ఉన్న ప్రాంతం హరియాణ. అక్కడి కురుక్షేత్ర జిల్లాలోని షాబాద్‌ గ్రామమే రాణీ సొంతూరు. తండ్రి రిక్షాలాగేవాడు. ఇద్దరు అన్నయ్యలు వదినలు ఉన్న ఆ కుటుంబమంతా ఓ పూరి గుడిసెలో సర్దుకొనేవారు. ఆరేళ్ల వయసులో ‘నేనూ హాకీ ఆడతా నాన్నా’ అని ఆమె అన్నప్పుడు అమ్మానాన్నలు ఉలిక్కిపడ్డారు. అవును మరి... రోజంతా రిక్షా నడిపితే వచ్చే పదీపరకా ఆదాయంతో ఆ పిల్లని బడికి పంపడమే గొప్ప. ఇక ఆటలూ.. పాటలూనా? అందుకే కరాఖండీగా వద్దనే చెప్పింది అమ్మ. ఆ అమ్మాయి అంతకంటే మొండిది. అన్నం తినకుండా ఏడుపులు, వేడుకోళ్లతో రోజూ సతాయించేది. స్కూల్‌కెళ్లి అక్కడి దగ్గర్లోని షాబాద్‌ హాకీ అకాడమీ కోచ్‌ బలదేవ్‌సింగ్‌నీ బతిమాలేది. చిన్న పిల్ల అని ఆ కోచ్‌ పట్టించుకోలేదు. ఎలా అయితేనేం మొదట నాన్నని ఒప్పించింది. కోచ్‌ మాత్రం ససేమిరా అన్నాడు. సన్నగా ఉందని వద్దంటున్నాడేమో అనుకున్నారు. కాదు.. అసలే పేదవాళ్లు. ఈ ఆటకూడా తోడై వాళ్ల జీవితం భారంగా మారకూడదనేది ఆయన ఆలోచన. కానీ రాంపాల్‌ వింటేనా? కాళ్లావేళ్లా పడ్డాడు. వాళ్ల తపనని గమనించిన కోచ్‌ బలదేవ్‌సింగ్‌ రాణీని శిష్యురాలిగా స్వీకరించాడు. అలా ఆరేళ్ల వయసులో అకాడమీలో అడుగుపెట్టింది రాణీ. రామ్‌పాల్‌కి మంచి హాకీ కిట్‌ కొనిచ్చే శక్తి కూడా లేదు. పేదరికం ఎన్నోసార్లు రాణీని వెనక్కిలాగినా... కోచ్‌  అండగా నిలిచాడు. సీనియర్లు పాత హాకీ కిట్‌లు ఇచ్చి ఆమెను  ముందుకు నడిపించారు.

కోచ్‌ బలదేవ్‌సింగ్‌ ఎంత ప్రేమగా ఉంటాడో అంత కఠినంగా కూడా ఉండేవాడు. అకాడమీకి రావడం రెండు నిమిషాలు లేట్‌ అయినా రెండొందల ఫైన్‌. వంద తీసుకురావడమే రాణీకి చాలా కష్టమయ్యేది. ఆ వందకి తనే మరో వంద వేసి ఇచ్చి ‘లేట్‌గా రావొద్దు’ అంటూ ప్రేమగా కసురుకొనేవాడు బలరామ్‌సింగ్‌. తనకీ లేట్‌గా రావడం ఇష్టం లేదు. రాణీ వాళ్ల అమ్మ సరిగా నిద్రపోకుండా కునికిపాట్లు పడుతూ మేలుకొని కూతురిని అకాడమీకి పంపేది. ఒక రోజు స్కూల్లో చేతిరాత పోటీలు జరుగుతున్నాయి. ఇందులో గెలిస్తే గడియారం ఇస్తారని తెలిసి రాణీ తన రాతను సరిచేసుకుని మొదటి ప్రైజు గెల్చుకుని అమ్మకు కానుకగా ఇచ్చింది. బంధువులు మాత్రం ‘పొట్టిబట్టలతో.. మగాడిలా ఏంటా తిరుగుళ్లు’ అంటూ ఈసడించేవాళ్లు. ఇన్ని కష్టాలు, విమర్శల మధ్య కూడా రాణీ సాధనని నిర్లక్ష్యం చేయలేదు. ఆ పట్టుదలే తనకి 14 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులో స్థానాన్ని కల్పించింది. అప్పటి నుంచీ తన లక్ష్యం ఒలింపిక్స్‌ పతకమే. టీం కెప్టెన్‌గా ఎదిగి ఎన్నో విజయాలు సాధించినా 2007 రాణీకి గడ్డురోజులనే చెప్పాలి. వెన్నెముక గాయం కారణంగా హాకీ స్టిక్‌ని పట్టుకోవడం కష్టమనే అన్నారంతా. కానీ అమ్మానాన్నల కష్టం వృథా పోకూడదనే పట్టుదలతో కఠోర సాధన చేసింది. తిరిగి మైదానంలో అడుగుపెట్టింది. కూల్‌ కెప్టెన్‌గా పేరుతెచ్చుకుంది. ‘నాకు మంచి బట్టలు ఉండేవి కావు. ఇవాళ అంతర్జాతీయ బ్రాండ్‌లు కోరిన దుస్తుల్ని అందిస్తున్నాయి. మా అమ్మానాన్నల కోసమే ఇదంతా సాధించాను’ అనే రాణీ ప్రస్తుతం ఎమ్మే ఇంగ్లిష్‌ చదువుతోంది. ‘మరొకరికి స్ఫూర్తిగా ఉండటమంటే నాకిష్టం. నన్ను తిట్టిన బంధువులే ఇప్పుడు మా పిల్లలకు హాకీ నేర్పిస్తావా అంటున్నారు. నా గ్రామంలో ఆడపిల్లల కోసం ఒక హాకీ అకాడమీ నిర్మించాలనేది నా కల’  అనే రాణీ అర్జున, పద్మశ్రీ, ఖేల్‌రత్న అవార్డులని అందుకుంది.


‘‘ ఫిట్‌నెస్‌ అంటే ప్రాణం. కానీ ఇంటికెళ్తే అమ్మ వండినవన్నీ తినిపెడతా. అమ్మని బాధపెట్టడం నాకిష్టం లేదు. మళ్లీ ఆ బరువు తగ్గడానికి చాలా కష్టపడాలి... అది వేరే విషయం అనుకోండి.’’

మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని