వయసు పెరగదు.. అందం తరగదు
close
Updated : 25/09/2021 05:42 IST

వయసు పెరగదు.. అందం తరగదు

ఈ అమ్మాయిని చూడండి. ఆసియన్‌- కొరియన్‌ పోలికలతో చాలా బాగుంది కదూ! పేరు రోజీ. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. యాడ్‌లతో కోట్లు సంపాదిస్తోంది. ఏమిటంత ప్రత్యేకమనుకుంటున్నారా? ఆమె అందం వందేళ్లయినా తరగదు మరి! అర్థం కాలేదా? అయితే చదివేయండి.
రోజీ పూర్తి పేరు ‘ఓహ్‌ రోజీ’ అంటే.. ఒకే ఒక అని. జాగింగ్‌, యోగా, ఇంకా తన ప్రయాణాల ఫొటోలను ఇన్‌స్టా ద్వారా పంచుకుంటూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంది. అందుకే 22 ఏళ్ల ఈ అమ్మాయి ఎన్నో యాడ్‌ అవకాశాలూ దక్కించుకుంది. కానీ... ఈమె నిజమైన అమ్మాయి కాదు.. వర్చువల్‌ అని చెప్పి షాకిచ్చారీమె సృష్టికర్తలు. మనిషి కాదంటే నమ్మలేనంత సహజంగా ఉంటాయి ఫొటోలు మరి!

సిడస్‌ స్టూడియో ఎక్స్‌ అనే సంస్థ ఈమెను తయారు చేసింది. అత్యాధునిక పరిజ్ఞానంతోనే నేటి తరానికి తగ్గట్టుగా ఉండేలా ఈ అమ్మాయిని రూపొందించారు. ఇందుకు 800కుపైగా ముఖ, శరీర కదలికలను 3డి మోడలింగ్‌ టెక్నాలజీ ద్వారా సేకరించారట. మొదట ఈమె ఫొటోలను ఇన్‌స్టాలో ఉంచితే అందరూ చాలా అందంగా ఉందని వేలల్లో లైకులు కొట్టారు. దాంతో యాడ్‌లూ ప్రారంభమయ్యాయన్నమాట. ఆ తర్వాతే అసలు విషయాన్ని చెప్పారు. ఇంతకీ ఈమె ఈ ఏడాది సంపాదన ఎంతో తెలుసా? ఒక బిలియన్‌ కొరియన్‌ వాన్‌ అంటే మన రూపాయల్లో ఆరు కోట్లకు పైమాటే. రోజీ తయారీ పెట్టుబడి వెనక్కి రావడమే కాకుండా లాభాలూ తెచ్చి పెడుతోంది.
ఫొటోలకు పోజులివ్వడం, వీడియోకు అనుగుణంగా కదలడం వంటివన్నీ చేస్తుందట. అయితే వీటికే పరిమితం కాకుండా ఈమెకో ప్రత్యేకమైన గొంతుకను కల్పించి, సినిమాల్లోకీ ప్రవేశపెతా మంటున్నారు రూపకర్తలు. రోజీకి వయసై పోదు, అలసటలేదు, వివాదాల ప్రస్తావనే ఉండదు... తనతో నటింపజేయడం సులువంటూ నిర్మాతలనూ ఆకర్షిస్తున్నారు. గత నెల కొరియన్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ కోసం ఈమె నటించిన యాడ్‌ను యూట్యూబ్‌లో పెడితే కోటిమందికి పైగా వీక్షించారు. అసలే ఏఐతో ఉద్యోగాలకు ఏమవుతుందోనని భయపడుతున్న యువతకు సోషల్‌ మీడియాలో సృజనాత్మకత విషయంలోనూ పోటీ ఎదురవబోతోందని అనిపిస్తోంది కదూ!


Advertisement


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని