వెన్నని ఇలా కూడా వాడచ్చు.. - other household uses of butter in telugu
close
Published : 08/08/2021 13:24 IST

వెన్నని ఇలా కూడా వాడచ్చు..

వివిధ రకాల ఆహారపదార్థాలకు చక్కటి రుచిని తీసుకురావడానికి మనం వెన్నను ఉపయోగిస్తాం. అయితే బటర్‌ని ఎక్కువగా తీసుకొంటే వూబకాయం సమస్య ఎదురవుతుందనే ఉద్దేశంతో చాలామంది దానివైపు చూడటానికి కూడా ఆసక్తి కనబరచరు. అలాంటి వారికోసమే ఆరోగ్యకరమైన పీనట్ బటర్‌లాంటివి సైతం మార్కెట్లోకి వచ్చాయి. అయితే కేవలం ఆహార పదార్థాల్లో వాడడానికే కాదు... దైనందిన జీవితంలో వెన్న వల్ల ఇతరత్రా ఉపయోగాలెన్నో ఉన్నాయి... వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం రండి...

* చాలా సందర్భాల్లో తలుపు వేస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు కిర్‌ర్..మనే శబ్దం వస్తూ ఉంటుంది. దీన్ని పోగొట్టడానికి కొద్దిగా బటర్‌ని మడత బందులకు రాస్తే.. ఇక శబ్దం రాకుండా ఉంటుంది.

* ప్లాస్టిక్ వస్తువులపై అయిన మరకలు వదలగొట్టాలంటే కష్టమే. అదే ఫ్రిజ్‌లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులయితే మరకలను శుభ్రం చేయాలంటే మరీ ఇబ్బంది. ఇలాంటి సందర్భాల్లో బటర్‌ని ఉపయోగిస్తే వాటిని చాలా సులభంగా పోగొట్టచ్చు. దీనికోసం మరక ఏర్పడిన చోట కొద్దిగా వెన్న రాసి 20-40 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత వస్త్రంతో తుడిచేస్తే మరక వదిలిపోతుంది.

* చేతులకు అంటుకున్న జిగురు(గ్లూ)ని వదలగొట్టడం అంత సులభమేమీ కాదు. కొన్ని సందర్భాల్లో అయితే శుభ్రం చేసేటప్పుడు చర్మం కూడా వూడిపోతూ ఉంటుంది. అయితే చేతులను శుభ్రం చేసుకొనే ముందు బటర్ రాసుకోవడం ద్వారా గ్లూని సులభంగా వదిలించుకోవచ్చు.

* చేపలు శుభ్రం చేసిన తర్వాత వాటిని ఉంచిన పాత్రల నుంచి వచ్చే నీచు వాసన ఓ పట్టాన పోదు. ఇలాంటప్పుడు వాసన వచ్చే పాత్రలను కొద్దిగా వెన్నతో తోమాలి. ఆ తర్వాత సబ్బు ఉపయోగించి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే పాత్రల నుంచి నీచు వాసన రాకుండా ఉంటుంది.

* అందం విషయంలోనూ వెన్న చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇది పొడిబారిన చర్మాన్ని తిరిగి తేమ సంతరించుకొనేలా చేస్తుంది. దీనికోసం కొద్దిగా బటర్‌ని చర్మానికి రాసుకొని తేలికపాటి సబ్బుతో రుద్ది శుభ్రం చేసుకోవాలి.

* రోజూ రాత్రి నిద్రపోయే ముందు గోళ్లకు కొద్దిగా బటర్ రాస్తే అవి ఆరోగ్యంగా తయారవుతాయి.

* కొన్ని కొన్ని సందర్భాల్లో వేలికి ఉన్న ఉంగరాలు, చేతులకు తొడుక్కున్న గాజులు తీద్దామంటే కుదరదు. ఇలాంటప్పుడు వెన్నని ఉపయోగిస్తే చాలా సులభంగా వాటిని తొలగించవచ్చు. దీనికోసం చేతికి కొద్దిగా వెన్న రాసి ఆ తర్వాత ఉంగరం లేదా గాజుని తీస్తే సులభంగా వచ్చేస్తుంది.

* చీజ్‌ను బూజు పట్టకుండా ఎక్కువకాలం నిల్వ ఉంచాలంటే దాని ఉపరితలంపై కొద్దిగా బటర్ రాస్తే సరిపోతుంది.

* సగం కోసిన ఉల్లిపాయలు పాడవకుండా ఉండాలంటే దానిపై కొద్దిగా వెన్నని రాయాలి. ఇలా చేస్తే ఉల్లిపాయ త్వరగా ఎండిపోకుండా ఉంటుంది.

* చెక్క వస్తువులపై ఏర్పడిన నీటి మరకలు తొలగించడానికి రాత్రి సమయంలో కొద్దిగా వెన్న రాసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేస్తే సరిపోతుంది.మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని