Uttarakhand: రూ.6లక్షల విలువైన నగలు తిరిగిచ్చి.. నిజాయతీ చాటుకున్న ఆటోడ్రైవర్‌

ఉత్తరాఖండ్‌లో ఓ ఆటోడ్రైవర్.. నిజాయితీ చాటుకున్నాడు. ఆటోలో మరిచిపోయిన 6లక్షల విలువైన పెళ్లి నగలు, 50 వేల నగదుతో కూడిన బ్యాగును.. సంబంధికులకు అందజేశాడు. నైనితాల్ జిల్లా హల్ద్ వానీలో ఓ పెళ్లివేడుక జరిగింది. ఆ పెళ్లి కుటుంబానికి చెందిన కొందరు ఆటోలో ఫంక్షన్ హాల్ కు వెళ్లారు. తొందరపాటులో నగదు, నగల బ్యాగ్‌ను ఆటోలోనే మరచిపోయారు. పెళ్లిమండపానికి వెళ్లి చూస్తే.. నగల బ్యాగు కనిపించకపోవటంతో ఆందోళన చెందారు. ఇంతలోనే ఆటోడ్రైవర్ పెళ్లి మండపానికి వచ్చి నగలు, నగదుతో కూడిన బ్యాగు తిరిగి ఇవ్వటంతో.. పెళ్లి బృందం ఊపిరిపీల్చుకుంది. ఆటోడ్రైవర్ నిజాయితీని పెళ్లికి వచ్చిన అతిథులే కాకుండా.. ఈ విషయం తెలిసిన స్థానికులు కూడా మెచ్చుకున్నారు. పెళ్లి మండపంలో ఆటోడ్రైవర్‌ను.. పూలమాలతో సత్కరించారు.

Published : 03 Dec 2022 16:42 IST

Tags :

మరిన్ని