close

Published : 24/10/2020 22:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చిన్నారిని కాపాడిన కలియుగ వసుదేవుడు!


ఇంటర్నెట్‌ డెస్క్‌ : హోరు వానలో వసుదేవుడు బాలకృష్ణుడిని తలపై పెట్టుకుని ఉప్పొంగుతున్న యమునా నదిని దాటించాడన్న కథ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదూ! అచ్చం అలాంటిదే ఈ ఘటన. భారీ వర్షాలకు అతలాకుతలమైన బెంగుళూరులో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో పదిహేను రోజుల వయసున్న శిశువును సురక్షితంగా తల్లి చెంతకు చేర్చాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం బెంగళూరులో కుండపోత వర్షం కురిసింది. దాంతో శివార్లలోని ఇళ్లు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో నీటిలో మునిగిన ఓ ఇంటి వద్ద నుంచి శిశువును తలపై పెట్టుకుని మరో ఇంటికి తీసుకెళ్లాడు ఆ యువకుడు. శిశువును సురక్షితంగా తల్లి చెంతకు చేర్చాడు ఈ కలియుగ వసుదేవుడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ఆ యువకుడు అదే రోజు మరొక చోట కూడా ఓ బాలికను కాపాడినట్లు తెలిసింది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.