Sat, February 06, 2016

Type in English and Give Space to Convert to Telugu

'గులాబీ.. సునామీ''మాట నిలబెట్టుకుంటాం''నౌకా సంరంభం నేడే''కక్షతోనే పార్లమెంటులో రగడ!''వ్యూహాత్మక విజయం''ఆఖర్లో వచ్చారు.. అదరగొట్టారు!''సమర సేనాని''పర్యాటకులకు మణిహారం''ముద్రగడ ఆమరణ దీక్ష''హైదరాబాద్‌లో మరో రెండు పెద్దాసుపత్రులు'
కబళిస్తున్న జీవనశైలి
తెలంగాణలో చాపకింద నీరులా విస్తరిస్తున్న అధిక రక్తపోటు.. మధుమేహం
పట్నం నుంచి పల్లెలకూ పాకుతోన్న వైనం
రాష్ట్రంలో 20% మందికి అధిక రక్తపోటు
6.3% మందికి చక్కెర వ్యాధి
ఖమ్మంలో మధుమేహం, మెదక్‌లో హైబీపీ అత్యధికం
భారతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ అధ్యయనంలో వెల్లడి
అత్యధిక శాతం మధుమేహులున్న జిల్లా.. హైదరాబాద్‌..
ఎక్కువ శాతం అధిక రక్తపోటు బాధితులున్న జిల్లా కూడా హైదరాబాదే!
ఇది గతం..
ధుమేహుల్లో ఖమ్మం, అధిక రక్తపోటు బాధితుల్లో మెదక్‌ జిల్లాలు తాజాగా హైదరాబాద్‌ను తలదన్నాయి. ఈ రెండే కాదు.. తెలంగాణ రాష్ట్ర పరిధిలో మరికొన్ని జిల్లాల్లోనూ హైదరాబాద్‌ కంటే ఎక్కువ శాతంలోనే అధిక రక్తపోటు, మధుమేహ బాధితులు నమోదవడం ఆందోళనకరమే! ఒకప్పుడు పట్నంలోనే ఎక్కువనుకునే జీవనశైలి జబ్బులు నేడు పల్లెలనూ ప్రభావితం చేస్తున్నాయని తాజా అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. ఇపుడు పట్నానికి, పల్లెకు మధ్య అంతరం తగ్గిపోవడంతో గ్రామాల్లోనూ ఈ వ్యాధులు విస్తరించాయి.

రాష్ట్రంలో అధిక రక్తపోటు సగటున 20 శాతం కాగా.. అన్ని జిల్లాల్లో కెల్లా మెదక్‌లో అత్యధికంగా 24.4 శాతంగా నమోదైంది. రాష్ట్ర సగటు కంటే ఐదు జిల్లాల్లో అధిక రక్తపోటు శాతం ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌ జనాభా దృష్ట్యా అత్యధిక మధుమేహులు, అధిక రక్తపోటు బాధితులు ఇక్కడే ఎక్కువగా ఉన్నారనేది అంచనా. అయితే ప్రతి వందమందిలో హైదరాబాద్‌లో మధుమేహులున్నది 6.4 మందిలోనే! రాష్ట్ర సగటు శాతం 6.3 కాగా, ఇంతకంటే ఏడు జిల్లాల్లో మధుమేహ బాధితుల శాతం ఎక్కువగా ఉన్నట్లుగా నమోదయింది. జీవనశైలిలో మార్పులే ఈ ధోరణికి మూలకారణాలని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జీవనశైలి వ్యాధులపై భారతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ జరిపిన తాజా అధ్యయన నివేదికలో అనేక అంశాలను పొందుపరచింది. 18ఏళ్లు పైబడిన వారిలో జరిపిన అధ్యయన ఫలితాలను ఇటీవల వెల్లడించింది.

ఆందోళన కలిగించేదే
నగరాల కంటే ఎక్కువగా గ్రామాల్లో జీవనశైలి వ్యాధులు విజృంభిస్తుండడం ఆందోళన కలిగించేదే. గత దశాబ్ద కాలంలో గ్రామీణ, నగర జీవనానికి మధ్యనున్న సన్నని గీత క్రమంగా చెరిగిపోయింది. పల్లెల్లోనూ శారీరక శ్రమ తగ్గిపోయింది. టీవీల ముందు గంటల తరబడి కూర్చోవడం సాధారణమైంది. తిండితీరులోనూ స్పష్టమైన మార్పులొచ్చాయి. ఇవన్నీ అధిక రక్తపోటు, మధుమేహ సమస్యలకు దారితీస్తున్నాయి.

- ఆచార్య సత్యశేఖర్‌, భారతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమసంస్థ
బాల్యం నుంచే మార్పు
అధిక రక్తపోటు, మధుమేహం రావడానికి శారీరక శ్రమ లేకపోవడం, కొవ్వు పదార్థాలున్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, మానసిక ఒత్తిడి, మద్యపానం మూల కారణాలనవచ్చు. వంశపారంపర్య కారణాల వల్లనూ యుక్తవయసులోనే రక్తపోటు, మధుమేహం వస్తున్నాయి. గ్రామాల్లో పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులనూ, మరోవైపు భారీకాయులనూ గమనిస్తున్నాం. బాల్యంలో ఇలా మితిమీరిన బరువు పెరగడం వల్ల.. యవ్వనంలోనే జీవనశైలి జబ్బులొచ్చి పడుతున్నాయి. శారీరకంగా చురుగ్గా ఉండాల్సిన ఇంటర్మీడియట్‌ వయసులో ర్యాంకుల కోసం బందీలను చేస్తున్నారు. చదువు రూపేణా పడే ఈ ఒత్తిడి కూడా జీవనశైలి రుగ్మతలకు ఓ కారణమవుతోంది.
- డా॥ఎంవీ రావు, జనరల్‌ ఫిజీషియన్‌, యశోద ఆసుపత్రి
నివేదికలో మరికొన్ని...
* 18ఏళ్లు పైబడినవారిలో సగటున 20శాతం మంది అధిక రక్తపోటు బాధితులే. వీరిలో రక్తపోటు 140/90గా గుర్తించారు.(సాధారణం 120/80) * వీరిలో 6శాతం మందిలో రక్తపోటు అదుపులో లేనట్లు(160/100) అధ్యయనాల్లో తేలింది. * 180/110 అధిక రక్తపోటు నమోదైనవారు రాష్ట్రంలో 2.6 శాతం మంది ఉన్నారు. * అధిక రక్తపోటు నమోదైన జిల్లాల్లో మెదక్‌(24.4శాతం) ముందుండగా.. వరంగల్‌ (23.1), మహబూబ్‌నగర్‌ (22.0), రంగారెడ్డి(21.5), హైదరాబాద్‌ (21.0) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. * హైదరాబాద్‌లో 25ఏళ్లు పైబడినవారిలో ప్రతి ఆరుగురిలో ఒకరు మధుమేహులే. * రాష్ట్ర సగటు కంటే కరీంనగర్‌(6.5), మహబూబ్‌నగర్‌(6.8), నల్గొండ(6.8), రంగారెడ్డి(7.2), నిజామాబాద్‌(7.4), ఖమ్మం(7.6) జిల్లాల్లో అధిక శాతంలో మధుమేహులున్నట్లుగా అధ్యయనాలు చెబుతున్నాయి. * 18ఏళ్లు పైబడిన వీరందరిలోనూ రక్తంలో చక్కెరస్థాయి 140 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. * మధుమేహ తీవ్రత మరీ ఎక్కువగా(రక్తంలో చక్కెర స్థాయి 160మిల్లీగ్రాముల కంటే ఎక్కువ) ఉన్నవారు రాష్ట్రంలో సగటు శాతం 3.4. * ఇంతకంటే అధికంగా నల్గొండ (3.8), హైదరాబాద్‌(3.9), మహబూబ్‌నగర్‌(4.0), రంగారెడ్డి(4.0), ఖమ్మం(4.1), నిజామాబాద్‌(4.2), కరీంనగర్‌(4.6) జిల్లాల్లో బాధితులున్నారు. * రక్తంలో చక్కెరస్థాయి 140మిల్లీగ్రాములు కంటే ఎక్కువ, 160 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్న రెండు విభాగాల్లోనూ మెదక్‌(5.0, 2.3), ఆదిలాబాద్‌(5.7, 2.6), వరంగల్‌(6.2, 3.3) జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువగా మధుమేహలున్నట్లుగా నమోదైంది.
- ఈనాడు, హైదరాబాద్‌

జీన్స్‌ ప్రభ!

కొన్నిరోజులు వాడగానే జీన్స్‌ బిగుతైపోతాయి. అలాగని వాటిని పారేయలేం. ఎందుకంటే చూడ్డానికేమో కొత్తగా ఉంటాయి. అలాంటి జీన్స్‌నే రీసైకిల్‌ చేసి కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి...

మనసంతా పొరుగు కథలపైనే!

మహేష్‌బాబు లాంటి ఒకరిద్దరు కథానాయకులు తప్ప దాదాపుగా మిగిలిన తెలుగు హీరోలందరూ రీమేక్‌ చిత్రాలపై మోజు ప్రదర్శించేవాళ్లే. పొరుగు భాషలో ఒక మంచి సినిమా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net