Fri, February 12, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
అడ్డగోలుగా రక్త పరీక్షలు
కనీస జాగ్రత్తలు పాటించకుండా నమూనాల సేకరణ
ప్రత్యేక శిబిరాలు, తగ్గింపు ధరల
పేరుతో నిలువు దోపిడీ
రోగ నిర్ధారణ పరీక్షలపై
నియంత్రణ లేని వైద్య ఆరోగ్యశాఖ
ఈనాడు - హైదరాబాద్‌
తెలంగాణ వ్యాప్తంగా ప్రమాణాల్లేని వ్యాధి నిర్ధారణ కేంద్రాలు (డయాగ్నోస్టిక్‌ సెంటర్లు) తామరతంపరగా పుట్టుకొస్తున్నాయి. రక్తం, మూత్రం తదితరాల విశ్లేషణకు ఒక కేంద్రంలో పరికరాలను ఏర్పాటుచేసుకొని, దానికి అనుబంధంగా పలుచోట్ల నమూనా సేకరణ కేంద్రాలను నెలకొల్పటం ఇటీవల ఎక్కువయింది. కొన్ని సంస్థలైతే... తగ్గింపు ధరలకే వైద్య పరీక్షలంటూ నగరం, శివార్లలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నాయి. అక్కడ కనీస ప్రమాణాలు మచ్చుకైనా కనిపించటంలేదు! కొద్ది గంటలుండే ఈ శిబిరాల్లో నమూనాల సేకరణకు ఒకరిద్దరు సిబ్బందిని తాత్కాలికంగా నియమించి, పనులు కానిచ్చేస్తున్నారు!

రంగారెడ్డి జిల్లా మణికొండలో ఈనెల 15న ఎస్సార్‌నగర్‌కు చెందిన ఓ సంస్థ ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరాన్ని ‘ఈనాడు’ ప్రతినిధి సందర్శించగా, అనేక విషయాలు వెలుగుచూశాయి. 33 విశ్లేషణలను రూ.600కే చేస్తామంటూ ప్రచారం చేయటంతో జనం అక్కడికి పెద్దసంఖ్యలో వచ్చారు. చేతికి తొడుగుల్లేకుండానే సిబ్బంది రక్తాన్ని సేకరించి, గంటల తరబడి ఆ రక్తపు గొట్టాలను బల్లపైనే ఉంచేశారు. రక్తాన్ని తీసినచోట అతికించేందుకు కనీసం ప్లాస్టర్‌ కూడా లేదు. రక్తాన్ని సేకరించే వ్యక్తి జలుబుతో ఉన్నా.. మాస్కు లేకుండానే పని కానిచ్చేశారు. రక్తం సేకరించిన తర్వాత ఆ సూదులను నిర్లక్ష్యంగా పడేయటమూ కనిపించింది. ఇక మూత్రాన్నయితే ఇంటి దగ్గర నుంచే తీసుకురావాలని ప్లాస్టిక్‌ డబ్బాలను ఇచ్చి పంపారు. ఈసీజీ పరికరం చాలాసేపటి వరకు పనిచేయలేదు. అక్కడికి వచ్చినవారి పేరు, వయసు తప్ప ఇతర వివరాలను సిబ్బంది రాసుకోలేదు. ఒకే పేరుతో ఇద్దరుంటే నివేదికలు తారుమారయ్యే ప్రమాదమున్నా, వారు పట్టించుకోలేదు. కారణం... శిబిరంలో పాల్గొన్న ఇద్దరు సిబ్బందీ తాత్కాలిక ప్రాతిపదికన వచ్చారు. ఒకరు దిల్‌సుక్‌నగర్‌లోని వేరే డయాగ్నోస్టిక్స్‌లోనూ, మరొకరు ఇంకో ఆస్పత్రిలోనూ పనిచేస్తున్నారు. ఎందుకు ప్రమాణాలు పాటించడంలేదని ప్రశ్నించగా... తమ యాజమాన్యానికి చెబుతామంటూ వారు సమాధానమిచ్చారు. చాలా సంస్థలు ఇలా మణికొండ, మియాపూర్‌, వనస్థలిపురం తదితర చోట్ల శిబిరాలను నిర్వహిస్తున్నాయి. పలు జిల్లాల్లోనూ ఇదే తంతు.

రక్త సేకరణలో పాటించాల్సిన ప్రమాణాలివీ...: వ్యాధిని బట్టి, పరీక్షను బట్టి రక్త సేకరణ విధానం ఉంటుందనీ... రక్త సేకరణలో చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా ఫలితాలు తారుమారయ్యే ప్రమాదముందని నిమ్స్‌ జీవరసాయన విభాగాధిపతి డాక్టర్‌ ప్రసుల్లా చంద్రన్‌ చెప్పారు. ర½క్తాన్ని సేకరించే వ్యక్తి కచ్చితంగా చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలనీ, ముఖానికి మాస్కు, చేతులకు తొడుగులను ధరించాలని నిమ్స్‌ మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్‌ లక్ష్మి చెప్పారు.ప్రాథమిక ప్రమాణాలను పాటించకపోతే వ్యాధులు విజృంభించే ప్రమాదముందనిహెచ్చరించారు.

ప్రమాణాల్లో కొన్ని...
* సాధారణగది ఉష్ణోగ్రతలోనే రక్తాన్ని సేకరించాలి.
* ఏ రక్త, మూత్ర పరీక్షనైనా గరిష్ఠంగా రెండు గంటల్లోపు నిర్వహించాలి. అంతకంటే ఎక్కువసేపు పరీక్షించకుండా వాటిని బయటే ఉంచితే, ఫలితాలు తారుమారయ్యే ప్రమాదముంది.
* లిపిడ్‌ ప్రొఫైల్‌, లివర్‌ ఎంజైములు, హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ ఏజీ తదితర రక్తం గడ్డకడితే నిర్వహించే పరీక్షల్లో.. రక్తాన్ని గొట్టంలోకి సేకరించిన 45 నిమిషాలపాటు దానిని కదపకూడదు.
* బ్లడ్‌ షుగర్‌, సీబీపీ వంటి రక్తం గడ్డకట్టకూడని పరీక్షల్లో 30 నిమిషాల్లోపూ రిఫ్రిజిరేటర్లో పెట్టాలి.
* యూరిన్‌ కల్చర్‌, బ్లడ్‌ కల్చర్‌, తెమడ పరీక్ష, ముక్కు, చెవి, గొంతు నుంచి నమూనాలను సేకరించడం వంటి పరీక్షల్లో క్రిమిరహిత (స్టెరైల్‌) వాతావరణమున్న గొట్టాల్లోనే సేకరించాలి. ఇలాంటి పరీక్షల్లో ఫలితాలు 24 గంటల తర్వాతే వస్తాయి. ఆలోగానే నివేదికలను ఇచ్చారంటే అందులో లోపమున్నట్లే!
* సేకరించిన రక్త నమూనాలను మరోచోటకు తరలించాల్సి వస్తే... 2-4 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఐస్‌ప్యాక్‌ల సాయంతో తరలించాలి.

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

‘బాహుబలి’ ఈ యేడాదే?!

‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అద్భుతం ఇంకా కళ్లముందు కదులుతూనే ఉంది. ఇప్పుడు అందరి దృష్టీ ‘బాహుబలి 2’పైనే. ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net