Mon, February 15, 2016

Type in English and Give Space to Convert to Telugu

'త్వరలో భూ సర్వే''తెలంగాణలో ఎయిర్‌బస్‌ హెలికాప్టర్ల తయారీ''ముంచుకొచ్చేసింది''సంక్షోభంలోనూ చెక్కుచెదరని భారత్‌''ఉల్లి..రైతు తల్లడిల్లి''నాలుగు నెలల్లో ఏపీలో సచివాలయం''రాష్ట్రంలో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం''పాలక సంస్థలకు పన్ను పోటా?''జేఎన్‌యూలో కార్యక్రమానికి హఫీజ్‌ మద్దతు''కు.ని.లో అవకతవకలకు అడ్డుకట్ట'
ఇలాగైతే పరీక్షలు వాయిదానే!
ఇప్పటికే నెల వెనకబడ్డాం
ఏ నిర్ణయమైనా త్వరగా చెప్పండి
ఇరు రాష్ట్రాల విద్యా మంత్రులకు తేల్చిచెప్పిన ఇంటర్‌బోర్డు
ఈనాడు - హైదరాబాద్‌
ఇంటర్‌ పరీక్షలపై ఏదో ఒక నిర్ణయం తేల్చిచెప్పాలని.. ఇంకా ఆలస్యం చేస్తే మార్చిలో నిర్వహించాల్సిన పరీక్షల్ని వాయిదా వేయక తప్పదని ఇంటర్‌ బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను హెచ్చరించింది. సోమవారం జరిగిన రెండు రాష్ట్రాల విద్యామంత్రుల సమావేశానికి బోర్డు సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. ‘‘విభజన ప్రక్రియకు సంబంధించిన ఆదేశాలు, వివరణలతో ఇప్పటికే ఈసారి పరీక్షల నిర్వహణ ప్రక్రియలో నెలరోజులు వెనకబడ్డాం. ప్రశ్నపత్రాల సెట్లను ప్రింటర్‌కు అందివ్వటంలో ఇంకా జాప్యం చేస్తే పరీక్షల ముందస్తు ప్రక్రియంతా దెబ్బతిని... పరీక్షల్ని వాయిదా వేయక తప్పదు. తద్వారా జాతీయస్థాయి సంస్థల్లో ప్రవేశాల కోసం ప్రయత్నించే రెండు రాష్ట్రాల్లోని లక్షలాది విద్యార్థుల ఆకాంక్షలు దెబ్బతినే ప్రమాదముంది’’ అని ఇద్దరు మంత్రులకూ బోర్డు తేల్చిచెప్పింది. పరీక్షల నిర్వరణ ముందస్తు వ్యవహారాలన్నింటినీ మంత్రులకు బోర్డు అధికారులు వివరించారు. ఉమ్మడిగానే పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం; విడివిడిగానే జరపాలని తెలంగాణ సర్కారు వాదిస్తున్న సంగతి తెలిసిందే. తమ వాదనలకు మద్దతుగా ఎవరికివారు కారణాలు చెబుతున్నా.. చివరకు అది తమ నెత్తిమీదకే వస్తుందని ఇంటర్‌ బోర్డు అధికారులు ఆందోళన చెందుతున్నారు.

మార్చిలో జరిగే పరీక్షలకు సెప్టెంబరు రెండో వారంలోనే ప్రక్రియ మొదలవుతుంది. ప్రశ్నపత్రాల తయారీ.. వాటిని సరిచూసుకోవటం; ప్రింటింగ్‌ పనులన్నీ చాలా రహస్యంగా జరగాల్సినవి. ఇవేవీ అనుకున్నంత సులభమైనవి కూడా కాదని బోర్డు అధికారులు మంత్రులకు తెలిపారు. పరీక్షలు విడివిడిగా/ ఉమ్మడిగా నిర్వహిస్తే తలెత్తే సమస్యల్ని కూడా మంత్రుల ముందుంచారు. బోర్డు అధికారులు సమర్పించిన వివరాల్లో కొన్ని..
* ప్రస్తుతం ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25శాతం; ఎన్‌ఐటీల్లో 40శాతం వెయిటేజీ ఇస్తున్నారు. జాతీయస్థాయి పరీక్షలు, ప్రవేశాల్లో సీబీఎస్‌ఈ పర్సైంటైల్‌ విధానాన్ని పాటిస్తోంది. విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తే 15% ఓపెన్‌కోటాలో నింపే సీట్ల గురించి సమస్య తలెత్తవచ్చు.
* ప్రశ్నపత్రాల స్థాయి, మూల్యాంకనం తీరుపై వివాదం తలెత్తే అవకాశముంది.
* ఉమ్మడిగా నిర్వహిస్తే రెండు రాష్ట్రాలూ పరీక్షలకు ఒకే సమయ సారిణి (టైమ్‌టేబుల్‌)కి అంగీకరించాలి.
* ఒకవేళ ఏదైనా ఒక రాష్ట్రంలో పరీక్ష వాయిదా వేయాల్సి వస్తే... నిర్వహించే వీలున్నా మరో రాష్ట్రం కూడా తప్పనిసరిగా వాయిదా వేయాల్సిందే.
* రెగ్యులర్‌ జనరల్‌ సబ్జెక్ట్‌ల్లో 768 సెట్ల ప్రశ్నపత్రాలు; వృత్తి విద్యాకోర్సుల్లో 1248 సెట్ల ప్రశ్నపత్రాలు రూపొందించాలి.
* డాటా ప్రాసెసింగ్‌ నుంచి మొదలెడితే.. ఓఎంఆర్‌షీట్లు, సమాధానపత్రాల ప్రింటింగ్‌ తదితర ఏడు అంశాలకు సంబంధించి టెండర్లు పిలవాలి.
* ప్రశ్నపత్రాల్ని ప్రింట్‌, ప్యాక్‌ చేసి బోర్డుకు అందివ్వటానికి ప్రింటర్‌కు (రహస్యంగా ఉంచుతారిది) కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది.
* ఇప్పటికే విభజన ప్రక్రియ కారణంగా షెడ్యూల్‌లో 30 రోజులు వెనకబడ్డాం.
* సివిక్స్‌, ఎకనామిక్స్‌, చరిత్ర, కామర్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, లాజిక్‌, ఫిలాసఫీ, సైకాలజీ, జాగ్రఫీ సబ్జెక్ట్‌ల్లో ద్వితీయ సంవత్సరానికి 2015-16 నుంచి సిలబస్‌ మార్చాలి. అలాగే ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్‌ సిలబస్‌ కూడా మార్చాల్సి ఉంది. కానీ రాష్ట్ర విభజన కారణంగా ఈ పని మొదలవ్వనే లేదు.
* జులైలో జరిగిన రెండు రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శుల సమావేశంలో సూచించినట్లుగా ఇప్పటికే బోర్డు విభజనకు సంబంధించి టైమ్‌లైన్‌ సమర్పించాం.
* ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన వివరాల్నీ అప్‌లోడ్‌ చేశాం. ఆదేశాల కోసం చూస్తున్నాం.
* ఇప్పటికే రెండు రాష్ట్రాలకు విడివిడిగా బ్యాంకు అకౌంట్లు తెరిచి, నిధుల్ని ఏపీ ,తెలంగాణలకు 58:42 నిష్పత్తిలో జమచేశాం.

నాసాకి పంపించా!

చందమామపై అడుగుపెట్టిన నీల్‌ఆర్మ్‌స్ట్రాంగ్‌ని కలిసిన ఓ వ్యక్తి ‘వస్తూవస్తూ మాకేం తెచ్చావ్‌..!’ అని అడిగాడట. అందుకు నీల్‌ ‘నా కాళ్లకంటిన కాసింత వెన్నెల!’...

వారియర్స్‌ ‘హీరో’చిత విన్యాసం

తెలుగు సినిమా క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందో తెలుసు కదా? అప్పటి వరకూ ప్రత్యర్థిదే ఆధిపత్యం కానీ చివర్లో హీరో వీరోచితంగా రెచ్చిపోతాడు...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net