close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నవ్యాంధ్ర ప్రగతికి గొడ్డలిపెట్టు

అమరావతి నుంచి రాజధాని తరలింపు పిచ్చి నిర్ణయం
  విశాఖలో ఔట్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణ జరగాలి
‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం’ పుస్తకంలో వడ్డే

ఈనాడు, అమరావతి: అమరావతి నుంచి రాజధాని తరలింపు నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రగతికి గొడ్డలిపెట్టు అవుతుందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. వికేంద్రీకరణ బిల్లు న్యాయస్థానాల్లో నిలబడదని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 254 (1)కు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం’ పేరుతో ఆయన రాసిన పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించారు. అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించాలనే పిచ్చి తుగ్లక్‌ నిర్ణయం మరొకటి ఉండదని.. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఉంటేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని భావించటం నేతి బీరకాయలో నెయ్యి చందమే అవుతుందని అందులో ప్రస్తావించారు. పుస్తకంలోని ప్రధానాంశాలివీ..
* విశాఖపట్నం పరిసరాలు, విజయనగరం జిల్లాలో వైకాపా నాయకులు, వారి బంధువులు, వారి వ్యాపార, పారిశ్రామిక సంస్థల కింద వేల ఎకరాలున్నాయి. వాటి విలువ పెంచుకునేందుకే విశాఖకు రాజధాని తరలింపు నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో తెదేపా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంశాలతో పాటు, విశాఖపట్నం పరిసరాల్లో వైకాపా నాయకులు, వారి బంధువుల ఔట్‌సైడర్‌ ట్రేడింగ్‌పై కూడా సీబీఐ విచారణ జరగాలి.
* ఆంధ్రప్రదేశ్‌ పై ఏడాది కాలంలోనే రూ.40 వేల కోట్లకు పైగా రుణభారం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబరు నెలాఖరు వరకూ రూ.1,78,697 కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా వేస్తే రూ.72,322 కోట్లే వచ్చింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో అమరావతి నుంచి సచివాలయం, విభాగాధిపతి కార్యాలయాలన్నింటినీ విశాఖపట్నం తరలించి పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారుతుంది.
* విజయవాడ-గుంటూరు మధ్య నూతన రాజధాని రావాలని ఎక్కువ మంది శివరామకృష్ణన్‌ కమిటీకి చెప్పారు. ఒక ప్రదేశంలో రాజధాని ఏర్పాటు నిర్ణయం తీసుకుని అక్కడ అన్ని వసతులు సమకూర్చుకున్న తర్వాత.. అధికారంలోకి వచ్చిన మరో ప్రభుత్వం  రాజధానిని మార్చేందుకు రాజ్యాంగంలో, చట్టంలో అవకాశం లేదు.
* రూ.వేల కోట్ల వ్యయంతో భవనాలు, మౌలిక వసతులు అమరావతిలో సమకూరాయి. వాటన్నింటినీ ఆపేసి.. విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన న్యాయస్థానంలో నిలవదు. స్టెరిలైట్‌ ఇండస్ట్రీస్‌ ఇండియా లిమిటెడ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమరావతి నుంచి రాజధాని తరలింపు కుదరదు.
* వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను శాసనసభ, మండలి బిజినెస్‌ రూల్స్‌కు, రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్‌ వద్దకు పంపించారు. ఆయన ఆమోదించటం దురదృష్టకరం. అయినా రైతులు భయపడక్కర్లేదు. ఈ బిల్లులు చెల్లవని హైకోర్టు తీర్పు ఇస్తుందనే విశ్వాసంతో ఉండాలి.
* విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటుకు రూ.వేల కోట్లు ఖర్చు అవుతుందనేది ప్రజలకు తెలియకూడదనే దాన్ని ద్రవ్యబిల్లుగా కాక సాధారణ బిల్లుగా ప్రవేశపెట్టారు. ఇది శాసనసభ నియమావళికి విరుద్ధం.
* రాజధాని మార్పునకు జగన్‌ చెబుతున్న కారణాల్లో నిజం లేదు. వివిధ భవనాలు 70-95 శాతం పూర్తయ్యాయి. దీని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాదు.
* చంద్రబాబు సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నారు. జగన్‌ తుగ్లక్‌ పాలనతో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అనుసరిస్తున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.