పోలీసుల దాష్టీకమే అబ్దుల్‌ సలాం ప్రాణం తీసింది

ప్రధానాంశాలు

పోలీసుల దాష్టీకమే అబ్దుల్‌ సలాం ప్రాణం తీసింది

ఈనాడు, అమరావతి: పోలీసుల దాష్టీకం వల్లే కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌సలాం, ఆయన కుటుంబీకులు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ అభిప్రాయపడింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొంది. కేసులో వాస్తవాలు కలవరపరిచేలా ఉన్నాయని ఆందోళన వెలిబుచ్చింది. యూనిఫాం ధరించిన అధికారంలోని వ్యక్తుల కారణంగా నాలుగు విషాదకర మరణాలు చోటు చేసుకున్నాయని, పోలీసులకు ప్రత్యక్ష సంబంధం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికిచ్చిన షోకాజ్‌ నోటీసులో పేర్కొంది. పోలీసు సిబ్బంది కారణంగా.. కుటుంబం ప్రాణాలు కోల్పోయిన సంఘటన తీవ్రమైనదిగా పేర్కొంది. ప్రజాసేవకుల ద్వారా తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని, దీనికి సంబంధించి తగిన మధ్యంతర పరిహారాన్ని 6వారాల్లోగా పిటిషనర్‌కు చెల్లించాలని ఎందుకు ఆదేశించకూడదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

సీఐడీకి కేసును అప్పగించాలి

అబ్దుల్‌సలాం, ఆయన కుటుంబీకుల ఆత్మహత్య కేసు తదుపరి దర్యాప్తును సీఐడీకి అప్పగించాలని ఆదేశించింది. ఇందులో ప్రమేయమున్న పోలీసులపై శాఖాపరంగా తీసుకున్న చర్యలు.. వివరాలతో కూడిన నివేదికను నిర్దిష్ట వ్యవధిలో సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి సూచించింది. కేసుకు సంబంధించి కర్నూలు ఎస్పీ ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. అక్టోబరు4న దీనిపై కమిషన్‌ విచారించనుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని