శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ

ప్రధానాంశాలు

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న సీజేఐకి తితిదే ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికి శ్రీవారి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. తితిదే ఈవో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సీజేఐ శ్రీ బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన శుక్రవారం ఉదయం నిర్వహించిన చక్రస్నానంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ హిమా కోహ్లి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ లలితకుమారి, జస్టిస్‌ సత్యనారాయణమూర్తి, ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పార్త్‌ ప్రతీం సాహు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.సోమరాజన్‌, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న హైకోర్టు సీజేకు తితిదే ఈవోజవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి దర్శనానంతరం జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర దంపతులు శ్రీ బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని