భరోసా ఇవ్వాల్సిన సమయంలో జల్సాలా!
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భరోసా ఇవ్వాల్సిన సమయంలో జల్సాలా!

నేతల గుర్రపు స్వారీపై విమర్శల వెల్లువ

రాజంపేట, న్యూస్‌టుడే: కరోనా కష్టకాలంలో ప్రజల ఇబ్బందులు తెలుసుకుని భరోసా ఇవ్వాల్సిన ప్రజాప్రతినిధులు, నేతలు గుర్రపు స్వారీతో కాలక్షేపం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కడప జిల్లా రాజంపేట మండలం ఆకేపాడులో ఈనెల 10న ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్‌ సురేష్‌బాబు, రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి సమావేశమయ్యారు. పలు విషయాలపై చర్చించారు. అనంతరం  శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, సురేష్‌బాబు తదితరులు చెయ్యేరులో గుర్రపుస్వారీ చేశారు. ఆ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీనిపై రెండు రోజులుగా  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కరోనా నియంత్రణలో విఫలం కాగా ఆ పార్టీ నేతలు ఇలా కాలక్షేపం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో వసతులు కల్పించాల్సిన సమయంలో ఇలా జల్సా చేయడం సరికాదు’ అంటూ ట్విటర్‌, ఫేస్‌బుక్‌ వేదికగా విపక్షాలు విమర్శిస్తున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు