కీలక పదవులన్నీ సొంత సామాజిక వర్గానికే
close

ప్రధానాంశాలు

కీలక పదవులన్నీ సొంత సామాజిక వర్గానికే

అచ్చెన్నాయుడి ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వెయ్యికి పైగా నామినేటెడ్‌, 49 సలహాదార్ల పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎన్ని కట్టబెట్టారో జగన్‌ చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తితిదే, ఆర్టీసీ, ఏపీఐఐసీ, పౌరసరఫరాలు, విత్తనాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, మార్క్‌ఫెడ్‌, జలవనరుల అభివృద్ధి బోర్డు, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ క్రీడాప్రాధికార సంస్థ, పర్యాటక బోర్డులకు ఛైర్మన్‌ పదవులన్నింటినీ జగన్‌ తన సామాజిక వర్గానికే కట్టబెట్టారన్నారు. తెదేపా ప్రభుత్వం ఆయా పదవులను బలిజ, యాదవ, మాదిగ, రెడ్డి, కమ్మ, కాపు, బ్రాహ్మణ, మైనారిటీ, బీసీ ఇలా.. వివిధ వర్గాలకు కేటాయించిందని పేర్కొంటూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ రాజకీయ నిరుద్యోగులు, సొంత సామాజికవర్గానికి పదవులు కట్టబెట్టడంపై ఉన్న శ్రద్ధ విద్యావంతులైన నిరుద్యోగులపై లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులను డమ్మీలను చేసి వారికి స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా చేశారని మండిపడ్డారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని