మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాపై కేసు నమోదు

ప్రధానాంశాలు

మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాపై కేసు నమోదు

గుంటూరు (పట్టాభిపురం), న్యూస్‌టుడే: తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై గుంటూరు అరండల్‌పేట ఠాణాలో కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైకాపా నాయకులు, కార్యకర్తల దాడిని నిరసిస్తూ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షా శిబిరంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. చంద్రబాబు చిటికేస్తే తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేస్తామని బొండా ఉమా హెచ్చరించినట్లు మేయర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఐపీసీ 504, 505, 506, 153 (ఎ), 294(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని