ప్రాంగణ ఎంపికల్లో కేఎల్‌యూ ప్రతిభ

ప్రధానాంశాలు

ప్రాంగణ ఎంపికల్లో కేఎల్‌యూ ప్రతిభ

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే: ప్రాంగణ నియామకాల్లో కేఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం విజయవాడ, హైదరాబాద్‌ క్యాంపస్‌లకు చెందిన విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని కేఎల్‌యూ ఉప కులపతి డాక్టర్‌ సారథి వర్మ వెల్లడించారు. 2022 సంవత్సరానికి జరుగుతున్న ప్రాంగణ నియామకాల్లో కేఎల్‌ విద్యార్థులు 3,062 మంది 90 అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారని చెప్పారు. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ సారథి వర్మ ప్రాంగణ నియామక వివరాలను వెల్లడించారు. డెలాయిట్‌, అమెజాన్‌, ఒరాకిల్‌ వంటి ప్రముఖ కంపెనీల్లో తమ విద్యార్థులు ఉద్యోగాలు సాధించటం గర్వకారణమన్నారు. మొత్తంమీద 85 శాతం విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. దీన్ని 100 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో కేఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ప్లేస్‌మెంటు విభాగం డీన్‌ డాక్టర్‌ ఎన్‌.బి.వి.ప్రసాద్‌, అడ్మిషన్‌ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ జె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని