తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. IND vs NZ: చివర్లో ఆకట్టుకున్న అశ్విన్‌.. టీమ్‌ఇండియా 345 ఆలౌట్‌

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 345 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (105; 171 బంతుల్లో 13x4, 2x6) శతకంతో కదంతొక్కాడు. రవీంద్ర జడేజా (50; 112 బంతుల్లో 6x4) తొలిరోజు స్కోర్‌ వద్దే ఔటయ్యాడు. ఇక టెయిలెండర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ (38; 56 బంతుల్లో 5x4) కీలక పరుగులు చేశాడు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌సౌథీ 5/69, కైల్‌ జేమీసన్‌ 3/91, అజాజ్‌ పటేల్‌ 2/90 ప్రదర్శన చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఎన్ని ఆంక్షలు పెట్టినా పాదయాత్ర ఆపబోం: అమరావతి రైతులు

అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర 26వ రోజుకి చేరుకుంది. నేడు రాజుపాలెంలో ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రం నెల్లూరు నగరానికి చేరుకోనుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని.. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ భూములు ఇచ్చామన్నారు. ప్రభుత్వం పోలీసులతో ఎన్ని ఆంక్షలు పెట్టినా తమ పాదయాత్ర ఆపబోమని రైతులు తేల్చి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ‘‘సాగు చట్టాల్లాగే విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్నీ వెనక్కి తీసుకోవాలి’’

3. Param Bir Singh: ముంబయి పేలుళ్ల తర్వాత.. కసబ్‌ ఫోన్‌ను ధ్వంసం చేసిన పరంబీర్‌..!

బలవంతపు వసూళ్లకు సంబంధించి పలు కేసులు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌పై మరిన్ని సంచలన ఆరోపణలు వస్తున్నాయి. 13ఏళ్ల క్రితం ముంబయి నగరంపై దాడికి పాల్పడిన పాకిస్థాన్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్‌ ఫోన్‌ను పరంబీర్‌ సింగ్‌ ధ్వంసం చేశారని విశ్రాంత అసిస్టెంట్ పోలీస్‌ కమిషనర్‌ సంషేర్‌ ఖాన్‌ పఠాన్‌ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కరోనా సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్‌.. ఆ కాలేజీలో 182కు చేరిన కేసులు

కర్ణాటకలోని ధార్వాడ్‌ మెడికల్‌ కాలేజీలో జరిగిన కళాశాల ఈవెంట్‌.. కరోనా సూపర్‌ స్ప్రెడర్‌గా మారింది. ఆ కళాశాలలో కరోనా సోకిన వారి సంఖ్య తాజాగా 182కు పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కాలేజీలోని మొత్తం సిబ్బంది, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా.. వైరస్‌ బారిన పడినవారిలో చాలా మంది టీకా రెండు డోసులు తీసుకున్నవారే కావడంతో వారందరికీ స్వల్ప లక్షణాలు మాత్రమే కన్పిస్తున్నాయని తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* India Corona: 10 వేలకు పైగా కొత్త కేసులు.. తగ్గిన రికవరీలు 

5. Nara Bhuvaneswari: నాకు జరిగిన అవమానం మరెవరికీ జరగకూడదు: నారా భువనేశ్వరి

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో జరిగిన పరిణామాలపై తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పందించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు భువనేశ్వరి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లి, తోబుట్టువు, కూతురికి జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను’’ అని భువనేశ్వరి పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Samantha: సామ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ స్టెప్‌.. మరోసారి బోల్డ్‌ రోల్‌

తాను ప్రపంచంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా భారతదేశాన్ని గర్వపడేలా చేస్తానని అగ్రకథానాయిక సమంత అన్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’ విజయంతో సమంత ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఆమెకు అవకాశాలు వరుస కడుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా సమంత.. తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ స్టెప్‌ తీసుకున్నారు. త్వరలో ఆమె విదేశీ చిత్రంలో తళుక్కున మెరవనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AlluArjun: పదేళ్లు.. పది సీజన్లు.. ఐకాన్‌స్టార్‌ ఎంట్రీ అదుర్స్‌

7. చిరంజీవి విజ్ఞప్తిని జగన్‌ దృష్టికి తీసుకెళ్లాం: పేర్ని నాని

రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశంపై పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా టికెట్ల పెంపుపై సీఎంతో చర్చించి నిర్ణయిస్తామని.. ఈ విషయాన్ని సినీ పెద్దలకు స్పష్టం చేశామన్నారు. టికెట్ల ధరలపై ప్రముఖ సినీనటుడు చిరంజీవి చేసిన విజ్ఞప్తిని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అసెంబ్లీ సమావేశాలు, వరదల సమీక్షపై సీఎం తీరిక లేకుండా ఉన్నారని.. త్వరలోనే ఆయన ఓ నిర్ణయం తీసుకుంటారని పేర్ని నాని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Stock Market: సూచీలను ముంచుతున్న కొత్త వేరియంట్‌  

గత ఏడాది కాలంగా లాభాల ర్యాలీలో మునిగి తేలిన సూచీలు ఇప్పుడు నష్టాల ధాటికి విలవిల్లాడుతున్నాయి. అధిక విలువల వద్ద గత కొంతకాలంగా లాభాల స్వీకరణ ఇప్పటి వరకు సూచీల పరుగుకు అడ్డుకట్ట వేయగా.. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు దానికి ఆజ్యం పోశాయి. దీంతో బుల్‌పై పట్టు సాధించేందుకు బేర్‌ ప్రయత్నాలు ప్రారంభించినట్లైంది. దీనికి ఐరోపా, అమెరికాలో కరోనా కేసులు.. తాజాగా దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్‌ మరింత బలాన్నిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

DCI Indonesia: అమ్మ బాబోయ్‌.. ఇంత లాభమా?

9. Truecaller: ట్రూకాలర్‌ కొత్త ఫీచర్లు.. కాల్ రికార్డింగ్‌ నుంచి ప్రాంక్‌ కాల్స్‌ దాకా..

కాలర్‌ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ మరి కొన్ని కొత్త ఫీచర్స్‌ను భారతీయ యూజర్స్‌కు పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. వీటిలో వీడియో కాలర్ ఐడీ, కాల్‌ రికార్డింగ్, ఘోస్ట్‌ కాల్‌, కాల్‌ అనౌన్స్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. ఇవి యూజర్స్‌కు భద్రతతోపాటు, సరికొత్త కాలింగ్ అనుభూతిని అందిస్తాయని ట్రూకాలర్‌ చెబుతోంది. వీడియో కాలర్‌ ఐడీ ఫీచర్‌ ద్వారా యూజర్స్‌ తమ స్నేహితులు, కుటుంబసభ్యలకు వీడియో కాల్ చేసినప్పుడు అవతలి వ్యక్తి కాల్ లిప్ట్‌ చేసిన వెంటనే ముందుగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. china: చైనాలో రవాణా ఓడలు మాయం.. ఎందుకు..?

ప్రపంచ కర్మాగారంగా పేరు తెచ్చుకొన్న చైనాలో ఏ సమస్య ఎదురైనా అది మిగిలిన దేశాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. అతిపెద్ద రేవులున్న చైనాలో గత కొన్ని నెలలుగా వాణిజ్య నౌకలు జాడలేకుండా పోతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా ప్రపంచ పంపిణీ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. తాజాగా ఈ ఓడల సమాచారం అంతర్జాతీయంగా అందుబాటులో ఉండకపోవడం, క్వారంటైన్‌ నిబంధనలు, కంటైనర్ల కొరత  పీడిస్తున్నాయి. సరుకు రవాణాకు సంబంధించి బుకింగ్స్‌..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Uttar Pradesh: 60 ఏళ్లుగా ఇసుకే ఆమె ఆహారం..!మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.