
తెలంగాణ
నార్కట్‌పల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తా మోస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
నార్కట్‌పల్లి గ్రామీణం, చిట్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత మాటల మధ్య తెలంగాణ రైతులు నలిగిపోతున్నారని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని ఐకేపీ కేంద్రం వద్ద బుధవారం ఆయన ధాన్యం బస్తాలను మోశారు. యాసంగిలో వడ్లు కొనలేమని ప్రభుత్వం చెబుతోందని.. కానీ, ప్రత్యామ్నాయ పంటలు ఏవి సాగు చేయాలో చెప్పడం లేదని విమర్శించారు. అంతకుముందు చిట్యాల మండలంలోని వెలిమినేడు వెళ్లి పారిశ్రామిక పార్కు భూ నిర్వాసితులతో మాట్లాడారు. ఆ పార్కును రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.