
క్రీడలు
ఢాకా: బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య చివరిదైన రెండో టెస్టును వర్షం వెంటాడుతూనే ఉంది. వాన కారణంగా మూడో రోజు సోమవారం ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రెండు రోజు 6.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన సంగతి తెలిసిందే. మొదటి రోజు చివరి సెషన్ ఆట కూడా జరగలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్లో 188/2తో ఉంది. తొలి టెస్టులో పాకిస్థాన్ గెలిచింది.