
గ్రేటర్ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు రాజ్‌భవన్ వేదిక కానుంది. పరేడ్‌గ్రౌండ్, పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే ఈ వేడుకలను కరోనా దృష్ట్యా ఈ సంవత్సరం రాజ్‌భవన్‌కు మార్చారు. 26వ తేదీ ఉదయం 7 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై పతాక ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం ఆమె పుదుచ్చేరి వెళ్లి అక్కడి వేడుకల్లో పాల్గొంటారు.