TFA: ‘డైరెక్టర్స్‌ డే’ ఈవెంట్‌ తేదీ మార్పు.. కొత్త డేట్‌ ఎప్పుడంటే!

దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్‌ డే’ ఈవెంట్‌ కొత్త తేదీని ప్రకటించింది.

Updated : 04 May 2024 16:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర దర్శకుడు దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా మే 4న ‘డైరెక్టర్స్‌ డే’ ఈవెంట్‌ను జరపాలని చిత్రసీమ భావించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ తేదీలో మార్పు చేస్తున్నట్లు తెలుగు ఫిల్మ్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ఎన్నికల కారణంగా తేదీని మార్చినట్లు పేర్కొంది. మే 19 సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్‌.బి.స్టేడియంలో ‘డైరెక్టర్స్‌ డే’ వేడుకల్ని నిర్వహించనున్నట్లు వెల్లడించింది. నేడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ప్రత్యేక మీటింగ్‌ నిర్వహించింది. అందులో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్‌, మెహర్ రమేష్, అనిల్‌ రావిపూడి, గోపీచంద్‌ మలినేని తదితరులు పాల్గొన్నారు. ‘డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ఇంత బాగుందంటే దానివెనక ఎంతోమంది ఉన్నారు. ‘డైరెక్టర్స్‌ డే’ గురించి ప్రపంచానికి తెలియాలనే ఈవెంట్ చేస్తున్నారు. అలాంటివి చేయడం చాలా కష్టం. పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ ఇందులో పాల్గోనున్నారు’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ‘డైరెక్టర్స్‌ డే’ ఈవెంట్‌ ఘనంగా జరగాలని సి.కల్యాణ్‌ కోరుకున్నారు.

ఇక ఈ మీటింగ్‌లో అనిల్‌రావిపూడి మాట్లాడుతూ తాను ఇటీవల ఐపీఎల్‌ మీద చేసిన కామెంట్స్‌పై స్పష్టతనిచ్చారు. ఇటీవల అనిల్‌ ఓ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్లో మాట్లాడుతూ.. ‘2 రోజులు మ్యాచ్‌ చూడకపోయినా ఏం కాదు..  స్కోర్‌ మీ ఫోన్లో చూసుకోవచ్చు. ముందు సినిమాలు చూడండి’ అన్న విషయం తెలిసిందే. దీనిపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. తాజాగా ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. ‘నేను ఇటీవల ఐపీఎల్‌ గురించి చేసిన వ్యాఖ్యలను సరిచేసుకుంటున్నాను. కావాలని మాట్లాడిన మాటలు కావవి. ఐపీఎల్‌ను చూడండి. మీకు సమయం ఉన్నప్పుడు మా సినిమాలు కూడా చూడండి. ఇది నా రిక్వెస్ట్‌. ఎవరినీ బాధ పెట్టాలని అలా మాట్లాడలేదు’ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని