ప్రభుత్వంపై విమర్శలు.. జేఎన్‌టీయూ ఉద్యోగి నాగభూషణం సస్పెన్షన్‌

అనంతపురం (జేఎన్‌టీయూ), న్యూస్‌టుడే: అన్నమయ్య జిల్లా కలికిరి జేఎన్‌టీయూలో పర్యవేక్షకుడిగా పనిచేస్తున్న ఎండీ నాగభూషణంను సస్పెండ్‌ చేసినట్లు అనంత జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ ఆచార్య శశిధర్‌ గురువారం తెలిపారు. అనంత జేఎన్‌టీయూలో పనిచేస్తున్న ఆయనను రెండేళ్ల కిందట కలికిరికి బదిలీ చేశారు. తన బదిలీ  కక్షసాధింపు చర్య అని అప్పట్లో నాగభూషణం ఆరోపించారు. తాజాగా బుధవారం రెడ్లరాజ్యంలో పనిచేయలేనని, త్వరలో స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం, అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అనంత జేఎన్‌టీయూ వద్ద నిరసన తెలిపారు. కలికిరి నుంచి అనంతపురానికి తనను బదిలీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆరోపణలపై ఉపకులపతి రంగజనార్దన, రిజిస్ట్రార్‌ శశిధర్‌ స్పందించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నందున నాగభూషణంకు గతంలోనే ఏడు సార్లు మెమోలు జారీ చేశామని తెలిపారు. ఆయన తీరు ఇప్పటికీ మారలేదని, ఏపీ రూల్స్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నందున ఆయనను సస్పెండ్‌ చేసినట్లు రిజిస్ట్రార్‌ తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని